దేశ వ్యాప్తంగా లాక్డౌన్ వల్ల చిక్కుకుపోయిన కూలీలను తిరిగి వారి సొంత గ్రామాలకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతూనే వున్నాయి. ఈ నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో.. రాష్ట్రల అభ్యర్థన మేరకు తీసుకుందన్న విషయం తెలిసిందే. ఈ విషయంతో ప్రారంభమైన విమర్శలు.. రానురాను మరింతగా పెరిగాయి. ఇక వలస కూలీలను తరలించేందుకు ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లను ప్రవేశపెట్టడంతో.. వీటిని ప్రయాణం నేపథ్యంలో 90 శాతం అక్యూపెన్సీ అయితే కానీ రైళ్లు కదలకూడదని చెప్పడం కూడా వివాదాస్పదం అయ్యింది.
అంతేకాదు ఈ రైళ్లను నడుపుతున్న నేపథ్యంలో ప్రయాణ ఖర్చులను రాష్ట్రాలు భరించాలని కేంద్రం ఆదేశించడం.. ఈ క్రమంలో రాష్ట్రాలు వలస కార్మికుల నుంచి రైల్వే టికెట్ చార్జీలను వసూళ్లు చేయాలని సంబంధిత రైల్వే జోనల్ అధికారులకు తెలపడం ఇందుకు ఆజ్యం పోసింది. వలస కార్మికుల నుంచి రైలు టిక్కెట్ల కోసం డబ్బులు తీసుకుంటున్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. దేశీయంగా కరోనా కట్టడి నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన నాటి నుంచి వలస కార్మికులు తాము పనిచేస్తున్న చోటే ఇరక్కుపోయి.. అటు పని లేక ఇటు వేతనాలు రాక అవస్థలు పడ్డారని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన ఈ పజిల్ ను ఎలా పూరించేది అంటూ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారుతోంది. 'ఓ వైపు దేశంలోని వలస కూలీలను తమ ప్రాంతాలకు తరలించడానికి కూలీల నుంచి రైల్వే శాఖ టిక్కెట్ల కోసం డబ్బులు వసూలు చేస్తోంది. మరోవైపు అదే రైల్వే శాఖ పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.151 కోట్లు విరాళంగా ఇస్తోంది. ఈ పజిల్‌ను పరిష్కరించేది ఎలా?' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాగా, వలస కూలీల నుంచి టిక్కెట్ డబ్బులు వసూలు చేయడం సరికాదని, కావాలంటే వారి టిక్కెట్ల డబ్బులను తాము భరిస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వలస కూలీల నుంచి టికెట్ వసూలు చేయడం సిగ్గుచేటైన విషయమని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more