ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్ పరీక్షలకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. ఏప్రీల్ మాసంలో జేఈఈ, మే మాసంలో నీట్ పరీక్షలు జరగాల్సి వున్నా కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదా పడిన విషయం తెలిసింది. దీంతో ఇవాళ తాజాగా ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించే విషయాలను కేంద్రం వెలువరించింది. జులై 18-23 మధ్య జేఈఈ(మెయిన్స్), జులై 26న నీట్, ఆగస్టులో జేఈఈ అడ్బాన్స్‌డ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటించారు.
కాగా దేశీయంగా జేఈఈ మెయిన్స్ పరీక్షల కోసం తొమ్మిది లక్షల మందికిపైగా విద్యార్థులు ఎదురుచూస్తుండగా, నీట్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 15.93 లక్షల మంది ధరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. పలువురి విద్యార్థులతో ఆయన సోషల్ మీడియా సాధానాల ద్వారా అన్ లైన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలను ఇచ్చారు. ఈ సందర్భంగా వాయిదా పడిన సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఇక రానున్న ఏడాది మాత్రం విద్యార్థులు కొంత తక్కువ సిలబస్ ను నేర్చుకోవాల్సి వుంటుందని అన్నారు, విద్యార్థులు విలవైన విద్యా సంవత్సరంలోని కొంత కాలాన్ని కోల్పోవడంతో తాము ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని, అందుకు తగ్గిన నిష్పత్తిలోనే రానున్న విద్యా సంవత్సరాన్ని, తగిన పోర్షన్ ను రూపోందిస్తామని చెప్పారు, దీంతో ఆ తరువాత రానున్న జేఈఈ మెయిన్స్ పరీక్షల్లోనూ సిలబస్ లో విద్యార్థులు నేర్చుకున్న సిలబస్ నుంచే ప్రశ్నాపత్రాలు వుంటాయని కేంద్రమానవ వనరులు శాఖా మంత్రి తెలిపారు. కాగా ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఈ ప్రతిపాదనను ముందుగా కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు,
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more