Liquor Sales to begin in Telangana from tomorrow తెలంగాణలో తెరుచుకోనున్న మద్యం షాపులు.. ధర పెంపు..

Liquor sales to begin in telangana from tomorrow with price hike

Liqour Shops, Lockdown, Liquor rates hike, Coronavirus, Covid-19, Liquor prices in Telangana, wine shops in TS, Liquor sales, Liquor Purchase, liqour prices, Telangana, Politics

Telangana government has decided to open liquor shops from tomorrow in all zones expect 15 containment areas. CM KCR had raised the liquor prices by 16 per cent as it is prepares to open retail liquor stores amid physical distance and mandatory mask conditions to be followed strictly.

తెలంగాణలో తెరుచుకోనున్న మద్యం షాపులు.. ధర పెంపు..

Posted: 05/05/2020 12:51 AM IST
Liquor sales to begin in telangana from tomorrow with price hike

కరోనావైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసే పనిలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్‌ రెండు విడతలు ముగిసిన తరువాత మూడో విడతతో దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరుచుకున్నా తెలంగాణలో మాత్రం మే 7వ తేదీ వరకు ఎలాంటి సడలింపులు ఉండవని చెప్పడంతో మందుబాబులకు నిరాశే ఎదురైంది. కాగా దేశవ్యాప్తంగా సంఘటనలను పరిశీలించిన తరువాత ఇవాళ క్యాబినెట్ బేటీ సమావేశంలో తెలంగాణలో మద్యం దుకాణాలు తరవని పక్షంలో జరగబోయే అనర్థాలను కూడా పరిశీలించిన మంత్రివర్గం మద్యం దుకాణాలు తెరిచేందుకు గ్రీస్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మే 6వ తేదీ అనగా రేపటి నుంచే తెలంగాణలో మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి.

ఇక తెలంగాణలో తొలిదశ లాక్ డౌన్ నుంచి మద్యం రుచిచూడని మందుబాబులు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. అయితే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో మందుబాబులు వ్యవహరించినట్టు ఇక్కడా చేస్తామంటే ఆ ఆటలను సాగనివ్వమని తేల్చిచెప్పారు. ఈ మేర సమాచారం అందిన వెంటనే మద్యం దుకాణాలను బంద్ చేస్తామని కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మద్యం దుకాణ యాజమానులతో పాటు మద్యం ప్రియులు కూడా తగు చర్యలు తీసుకోవాలని అదేశించారు. ఇక మద్యం విక్రయాలకు పలు షరతులు వర్తిస్తాయని కూడా సీఎం కేసీఆర్ తెలిపారు. మందుబాబులు తప్పనిసరిగా బౌతిక దూరాన్ని పాటించాలని, ముఖానికి మాస్క వేసుకుంటేనే మద్యం అందిస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నో మాస్క్ నో లిక్కర్ అనే విధానాన్ని తెలంగాణలో ఆచరణలో పెట్టబోతున్నామని చెప్పారు. దీంతో సీఎం కేసీఆర్ నో మాస్క్ నో ఎసెన్షియల్స్ విధానాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేయాలని అధికారులకు సూచించారు. మాస్క్ వేసుకోకుండా ఎవరు నిత్యావసర సరుకులు కొనేందుకు వచ్చినా వారిని అనుమతించవద్దని చప్పారు. ఇక తెలంగాణలో మద్యం ప్రియులకు కూడా మొత్తానికి కేసీఆర్ సర్కార్ ఆనందంలో ముంచింది. దీంతో ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా.? అని మందుబాబులు వేచిచూస్తున్నారు.  

మద్యం ధరల పెంపు..

దేశవ్యాప్తంగా మద్యం ధరలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్న నేపథ్యంలో తెలంగాణలోనూ ధరలను పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఢిల్లీ తరహాలో కరోనా టాక్స్ లు ఇబ్బడి ముబ్బడిగా వడ్డీంచడం తమకు అసమజసంగా తోచిందన్న కేసీఆర్.. సాధరణ క్రమంలోనే మద్యం ధరలను పెంచుతున్నట్లు తెలిపారు. ఛీఫ్ లిక్కర్ ధరలపై 11శాతం మేర పెంపు విధిస్తుండగా, ఆపైన మద్యం ధరలను ఏకంగా 16 శాతం మేర పెంచుతున్నట్లు చెప్పారు. కరోనా లాక్ డౌన్ ఎత్తివేత, సాధారణ పరిస్థితులు యధావిధంగా వచ్చిన తరువాత కూడా ఈ ధరల తొలగింపు వుండబోదని కేసీఆర్ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles