కరోనా వైరస్ మహమ్మారితో నిత్యం భక్తులతో కిటకిటలాడే పుణ్యక్షేత్రాలు కూడా లాక్ డౌన్ లో భాగంగా మూసివేయబడ్డాయి. ఇక్కడకు చేరుకునే భక్తులకు ఎలాంటి అనారోగ్యం సంక్రమించకూడదని ఆలయాల ట్రస్టులు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనాలకు భక్తులను అనుమతించడం లేదు. భక్తులు కూడా ఇళ్లకు మాత్రమే పరిమితం అయ్యారు. ఇక దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం దేవాలయ నిర్వహణకు కూడా కష్టాలు ఎదుర్కోంటున్నాయి. తమ వార్షికాదాయాన్ని ఓ వైపు కోల్పోవడంతో పాటు భక్తుల కానుకలు, విరాళాల ద్వారా లభించే ఆదాయాన్ని కూడా కోల్పోతున్నారు.
అన్ని ఆలయాల దర్శనాలను నిలిపివేయటంతో పెద్ద మొత్తంలో ఆలయాల ఆదాయాలకు గండిపడుతోంది. అటు తిరుమల తరువాత ఆదాయంలో రెండవ స్థానాన్ని పోందిన షిర్డీ సాయిబాబా సంస్థాన్ మినహాయింపు కాదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన షిర్డీ సాయి బాబా ఆలయం భక్తుల రాకపోకలు లేక బోసిపోవటమే కాకుండా నిత్యం కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తోంది. షిర్డీ సాయి బాబా మందిర్ ట్రస్టు ప్రతిరోజూ 1.58కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్ట పోతోంది. మామూలుగా ప్రతీ సంవత్సరం విరాళాల ద్వారా దాదాపు రూ. 600 కోట్లు ఆదాయం వచ్చేది. కానీ, లాక్డౌన్ కారణంగా మార్చి 17నుంచి మే 3 వరకు కేవలం రూ.2.53 కోట్ల విరాళాలు మాత్రమే వచ్చాయి.
ఇక లభించిన ఆ విరాళాలు కూడా ఆన్లైన్ ద్వారా. లాక్డౌన్కు ముందు ప్రతిరోజు రూ. 1.60కోట్ల విరాళాలు వస్తుండగా.. ఇప్పుడా సంఖ్య రూ.6 లక్షలకు పరిమితమయింది. ఒక వేళ జూన్ వరకు లాక్డౌన్ కొనసాగిస్తే సాయిబాబా ఆలయం రూ.150 కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. ఇదే గనుక జరిగితే గుడి నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలపై ఆ ప్రభావం పడనుంది. కాగా, కరోనా కారణంగా ప్రముఖ షిర్డీ సాయి బాబా ఆలయం మార్చి 17నుంచి బాబా దర్శనాన్ని నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజుకు 8-9 మంది భక్తులు మాత్రమే ఆన్లైన్ ద్వారా సాయిని దర్శించుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more