దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎయిరిండియా విమానాలకు చుక్కెదురైంది. ఇవాళ్టి నుంచి ప్రారంభమైన దేశీయ విమానాలతో పాటు గత కొన్ని రోజుల క్రితమే విదేశాల్లో చిక్కుకున్న భారతీయలును తీసుకువచ్చేందుకు విమానాలు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే విమాన ప్రయాణాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు నడుస్తున్న అంతర్జాతీయ విమానాల్లో మధ్య సీట్లను తప్పనిసరిగా ఖాళీగా ఉంచాలని స్పష్టం చేసింది.
కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు సామాజిక దూరం పాటించడం అనేది తప్పనిసరి అని సుప్రీంకోర్టు అదేశాలను జారీ చేసింది. విదేశాలలో చిక్కుకుని నాల్గవ విడత లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా స్వదేశానికి వస్తున్న పౌరులను సురక్షితంగా తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుందని, ఈ నేపథ్యంలో బౌతిక దూరం తప్పనిసరి అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో పౌరవిమానయానంపై కాసింత ఘాటుగానే ప్రభుత్వాన్ని మందలించినంత పనిచేసింది అత్యున్నత న్యాయస్థానం, వాణిజ్య విమానయాన సంస్థల కన్నా పౌరుల ఆరోగ్యం గురిచి ప్రభుత్వాలు ఆందోళన చెందితే బాగుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేశపౌరుల ప్రాణాల
వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఎయిర్ ఇండియా వెనక్కి రప్పిస్తోన్న విషయం తెలిసిందే. అయితే మధ్య సీట్లను భర్తీ చేయడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సుప్రీం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ సర్వీసులను కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున అవి మరింత విజృంభించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more