SC: YSRCP flag colours can't be used on govt buildings సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ.. రంగుల తొలగించాల్సిందే..

Remove party colours from all public buildings in four weeks supreme court to ap govt

Supreme Court, YS Jagan Mohan Reddy, YSRCP party colours, public offices, Government buildings, YSRCP, Andhra Pradesh, Politics

In a rude shock to the YSRCP government led by chief minister YS Jagan Mohan Reddy, the Supreme Court struck down the petition filed over the party colours on government buildings. The court has ordered the removal of colours on government buildings within four weeks of stipulated time and warned of filing contempt of court.

సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ.. రంగుల తొలగించాల్సిందే..

Posted: 06/04/2020 11:49 AM IST
Remove party colours from all public buildings in four weeks supreme court to ap govt

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తాకింది. రాష్ట్రంలో గ్రామ సచివాలయాలకు రంగులు వేయడంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ న్యాయస్థానం కొట్టివేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన న్యాయస్థానం రంగుల తొలగింపుకు నిర్ణీత గడువును విధించింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న రంగులను తొలగించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. లేకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని ప్రకటించింది.

రాష్ట్రంలోని గ్రామ పంచాయితీలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రస్తుతమున్న మూడు రంగులకు అదనంగా మరో రంగు వేయాలని ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను ఏపీ హైకోర్టు మే 22వ తేదీన సస్పెండ్ చేసిన తెలిసిందే. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సమర్ధించింది. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయితీలకు అధికార పార్టీకి చెందిన రంగులు వేయడం వివాదాస్పదం అయ్యింది. దీనిపై విపక్షాలతో పాటు పలు ప్రజాసంఘాలు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.

న్యాయస్థానం రంగులు తొలగించాలని అదేశాలు ఇచ్చినా ప్రభుత్వం.. ఉన్న రంగులకు అదనంగా మరో రంగును అద్ది మిగిలిన రంగులను అలాగే వుంచాలని అధికార యంత్రాగాన్ని అదేశిస్తూ.. ఇందుకుగాను జీవో 623 జీవోను తీసుకువచ్చింది. అయితే దీనిని కూడా విపక్షాలు సవాల్ చేశాయి. ఇక హైకోర్టు అదేశాలను ధిక్కరిస్తూ ఎన్నికల సంఘం సహా ప్రభుత్వ సీఎస్ ఎలా నిమ్మకున్నారని ప్రశ్నించింది. ఈ మేరకు అధికారులు కూడా తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని అదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటీషన్ వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  YS Jagan  YSRCP party  Government buildings  Andhra Pradesh  Politics  

Other Articles