కరోనా వైరస్ బారినపడిన రెండు ఊపిరితిత్తులు పాడైపోయిన యువతికి భారతీయ సంతతికి చెందిన వైద్యుడు విజయవంతంగా వాటిని మార్పిడి చేశాడు. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలోని షికాగోలో జరిగిందీ ఘటన. ఇక్కడి నార్త్ వెస్టర్న్ మెడిసిన్ ఆసుపత్రిలో 20 ఏళ్ల యువతి చేరింది. కరోనా వైరస్ ప్రభావంతో ఆమె రెండు ఊపిరితిత్తులు పాడైన విషయాన్ని గుర్తించిన వైద్యులు వాటిని మార్చాలని నిర్ణయించారు. కాగా అమెకు విజయవంతంగా శస్త్రచికిత్స చేయడంలో అక్కడి వైద్యుల బృందం సక్సెస్ అయ్యింది. ఈ బృందానికి భారతీయ సంతతికి చెందిన వైద్యుడు నేతృత్వం వహించాడు.
కరోనా మహమ్మారి ప్రారంభమయ్యాక అమెరికాలో ఇలాంటి ఆపరేషన్ నిర్వహించడం ఇదే మొదటిసారి అని భావిస్తున్నారు. భారత సంతతి వైద్యుడు, థొరాసిక్ సర్జన్ నిపుణుడైన డాక్టర్ అంకిత్ భరత్ నేతృత్వంలో ఆమెకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఇరవై ఏళ్లలో వున్న యువతి కరోనా వైరస్ తీవ్రత వల్ల అమె ఆరువారాల పాటు వెంటిలేటర్, ఎక్సట్రాకార్పోరియల్ మెంబరేన్ ఆక్సిననేషన (ఎక్మో)పై ఉండాల్సి వచ్చిందని తెలిపారు. ఎక్మో యంత్రం రోగి గుండె, ఊపిరితిత్తులు చేసే విధులను నిర్వర్తించే ప్రాణాధార యంత్రమని చెప్పారు.
ఈ నెల ప్రారంభంలో యువతి ఊపిరితిత్తులు, చికిత్సకు వీలుకాని స్థాయిలో దెబ్బతిన్నాయని గుర్తించామని, దీంతో అమెకు రెండు ఊపిరితిత్తులు ట్రాన్స్ ప్లాంట్చేయాలని నిర్ణయించామని చెప్పారు. దీంతో 48 గంటల తరువాత అమెకు సర్జరీ చేశామని చెప్పారు. కరోనా రోగికి అమెరికాలో ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ ఇదే మొదటిది కావడం గమనార్హం. కరోనా బాధితుల్లో అవయవ మార్పిడి ఆపరేషన్ చాలా సవాళ్లతో కూడుకున్నదని ఈ సందర్భంగా డాక్టర్ అంకిత్ తెలిపారు. తప్పని పరిస్థితుల్లో కోవిడ్ రోగులకు శస్త్రచికిత్స నిర్వహించవచ్చన్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఊపిరితిత్తులు సేకరించినట్టు వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more