ప‌్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి ఇప్పటికే మన దేశీయ సంస్థలు ఔషదాన్ని కనుగోన్నాయి. దీంతో కరోనా పేరు వినగానే భయాందోళన చెందుతున్న పలు నగరాలవాసులకు కొంత ఊరట లభించినట్లు అయ్యింది. గ్లెన్ మార్క్ సంస్థ స్వల్ప, మధ్యస్థ సాయి కరోనా ఉద్దృతికి గురైన రోగులకు నోటి ద్వారా తీసుకునే మందులను కనుగోనగా, హెటిరో, సిప్లా సంస్థలు కరోనా ఉధ్దృతి అధికంగా వున్న రోగులకు ఇంజక్షన్ రూపంలో మందును తీసుకువచ్చింది. ఇదిలావుండగానే ఆఫ్రికా ఖండంలోని నైజీరియా మాత్రం అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోని అగ్రదేశాలతో పాటు అనేక దేశాలు కరోనాకు వాక్సీన్ రూపోందించేందుకు పోటీపడుతున్న క్రమంలో నైజీరియా దానిని సుసాధ్యం చేసి అద్భుత అవిష్కరణను తమ దేశప్రజల ముందుకు తీసుకువచ్చింది.
ఈ మేరకు నైజీరియా విశ్వవిద్యాలయం ఒకటి.. తాము వ్యాక్సిన్ కనుగొన్నట్టు శుక్రవారం ప్రకటించాయని స్థానిక మీడియా ద్వారా తెలిసింది. అయితే భారత్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, చైనా, ఆస్ట్రేలియా సహా అనేక దేశాలు వ్యాక్సిన్ కోసం విస్తృతంగా పరిశోధనలు చేస్తున్న తరుణంలో నైజీరియా ఒక అడుగు ముందుకేసీ ఈ వాక్సీన్ ను కనుగొనింది. అగ్రరాజ్యంతో పాటు వైద్యరంగంలో అగ్రస్థానంలో నిలిచే పలు దేశాలు కోట్లలో ధనం వెచ్చిస్తూ వాక్సీన్ ను తయారు చేసే పనుల్లో నిమగ్నమై వున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 13 వ్యాక్సిన్లను మనుషులపై ప్రయోగిస్తున్నారు. 120 సంస్థలు వాక్సీన్ కనుగొనడంలో నిమగ్నమయ్యాయి.
ఆఫ్రికాలో ఆఫ్రికన్ల కోసం ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని అడిలెక్ యూనివర్సిటీలో మెడికల్ వైరాలజీ, ఇమ్యునాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ ప్రత్యేక నిపుణుడు, డాక్టర్ ఒలడిపో కొలవోల్ ప్రకటించారని ది గార్డియన్ నైజీరియా తెలిపింది. ఈ పరిశోధనకు ఆయనే నేతృత్వం వహించారు. ఈ వాక్సీన్ అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు కనీసం 18 నెలల సమయం పడుతుందని ఒలడిపో అన్నారు. మరిన్ని ట్రయల్స్, విశ్లేషణ అవసరమని, వైద్య అధికార వర్గాల నుంచి అనుమతుల రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సార్స్ కొవ్2 జీనోమ్ కోసం ఆఫ్రికా మొత్తం విస్తృతంగా అన్వేషించామని ఆయన వెల్లడించారు.
వ్యాక్సిన్ కనుక్కోవడం వాస్తవమేనని ప్రీసియస్ కార్నర్ స్టోన్ వర్సిటీ ప్రొఫెసర్ జూలియస్ ఒలోక్ సైతం తెలిపారు. తాము కరోనా వైరస్ మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొన్న మాట నిజమేనన్నారు. తాము చాలాసార్లు ప్రయోగాలు చేసి విశ్లేషించామని.. వాక్సీన్ రూపోందించామని ఒలోక్ తెలిపారు. అయితే తాము కనుగోన్న వాక్సీన్ ఆఫ్రికన్లే లక్ష్యంగా తయారు చేశామన్నారు. ఇతరులు సైతం ఉపయోగించొచ్చునని.. ఇది పనిచేస్తుందని తెలిపారు. తమ దేశ శాస్త్రవేత్తల అంకితభావానికి వచ్చిన ఫలితమే ఇదని ఆయన కొనియాడారు. చాలామంది శాస్త్రవేత్తలు ఇందుకోసం ఎంతగానో శ్రమించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ అవసరం ఎంతో ఉంది. అందుకే మేం దీనిపై దృష్టిపెట్టామని ఆయన వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more