కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తితో దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో రాష్ట్రానికి అదాయం భారీగా తగ్గింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్ల జేబులకు చిల్లులు పడ్డాయి. మార్చి నుంచి మే వరకు మూడు నెలల పాటు ఉద్యోగులకు, పెన్షనర్లకు కొతలు విధించారు. ఇక దేశవ్యాప్తంగా జూన్ ఆరంభం నుంచి అన్ లాక్ 1.0 విధించడంతో రాష్ట్రాలకు కాస్తో కూస్తో ఆదాయం సమకూరుతోంది. దీంతో ఇకపై తమ జీతాలు, పెన్షన్లలో కోతలు లేకుండా పూర్తి వేతనాలు కల్పించాలని తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావును ఉద్యో్గ జేఏసీ నేతలు కలిశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ, పబ్లిక్ సెక్టార్, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘాల నేతలు ఉద్యోగుల ఐక్యవేదిక తరపున ప్రతినిధులు మంత్రి హరీశ్ రావును కలిసిన అనంతరం వారికి లభించిన భరోసాతో మంత్రి తమకు గుడ్ న్యూస్ అందించారని మీడియాకు వెల్లడించారు. తమ సమస్యలను మంత్రికి వివరించామని.. మంత్రివర్యులు తమ సమస్యలపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. జూన్ నెల నుంచి పూర్తి వేతనాలు చెల్లించేందుకు మంత్రి అంగీకరించారని వెల్లడించారు. ఇక పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చేందుకు మంత్రివర్యులు అంగీకరించారని తెలిపారు.
ఈ మేరకు ఐక్యవేదిక ప్రతినిధులు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇక మార్చి నుంచి మే నెల వరకు కొత విధించిన వేతనాలపై కూడా మంత్రివర్యులతో చర్చలు జరిపామని చెప్పారు, అయితే కోత విధించిన వేతనాలతో పాటు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు కూడా చెల్లింపులు జరుగుతాయని చెప్పారు, అయితే వాటిని నేరుగా వేతనాలతో కలపి కాకుండా జీపీఎఫ్ ఖాతాలో జమ చేయాలనుకుంటున్నట్టు తెలిపారని చెప్పారు. కాగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఐక్యవేదిక మాత్రం తమ వేతన బకాయిలను జీపీఎఫ్ లో కాకుండా... నగదు రూపంలోనే ఇవ్వాలని మంత్రిని కోరామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more