ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాకు పతంజలి యోగఫీఠ్ తొలిసారిగా ఆయుర్వేద మందు తీసుకువచ్చిందని ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి పేర్కొన్న నేపథ్యంలో వెనువెంటనే ఆయుష్ మంత్రిత్వశాఖ దానికి బ్రేకులు వేసింది. ‘కొరోనిల్’ పేరుతో పతంజలి సంస్థ తీసుకువచ్చిన మందును మార్కెట్లోకి తీసుకురాకుండా తాత్కాలికంగా బ్రేకులు వేసింది. తమ సంస్థ కరోనా చికిత్సకు అత్యంత చౌకగా, సామాన్యులకు అందుబాటు ధరలో మందును తీసుకువచ్చిందని ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ తెలిపినా.. ఆయుష్ మంత్రిత్వశాఖ మాత్రం ఈ మందును మార్కెట్లోకి తీసుకురావడం, ప్రచారం నిర్వహించడంపై తాత్కాలిక ఆంక్షలను విధించింది.
పతంజలి సంస్థ తీసుకువచ్చిన కరోనిల్ ఆయుర్వేద మందు ఎలా పనిచేస్తుందన్న విషయమై పరీక్షలు జరపాలని.. మందును పరిశీలించి ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతులు జారీ చేసేవరకు ఎలాంటి ప్రచారం నిర్వహించడం కానీ మార్కెటింగ్ చేయడం కానీ చేయరాదని పతంజలీ సంస్థకు ఆయుష్ మంత్రిత్వశాఖ అధికారులు సూచించారు. పతంజలి కరోనిల్ మందును ఎలా తయారు చేశారు.. ఏయే ఔషదాలను ఎంత మోతాదులో వినియోగించారు అన్న వివరాలను కూడా సాధ్యమైనంత త్వరంగా ఇవ్వాలని సూచించామని తెలిపారు. ఈ కరోనిల్ ఔషధం క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతమయ్యాయని బాబా రాందేవ్ తెలిపిన నేపథ్యంలో ఎక్కడ వాటిని పరీక్షించారు, సాంపుల్ సైజు, రిజిస్ట్రేషన్, పరిశోధించిన సంస్త, దానికి ఎథిక్స్ కమిటీ క్లియరెన్స్ పత్రాలు, రిజల్టు డేటా అన్నింటినీ పంపితే తాము పరిశీలిస్తామని తెలిపారు.
కాగా హరిద్వార్ లోని యోగ్ పీఠ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బాబా రాందేవ్ కరోనా చికిత్సకు కరోనిల్ మందును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాందేవ్ మాట్లాడుతూ.. ఆయుర్వేదంతో కరోనాను నయం చేయవచ్చునని అన్నారు. తమ కరోనిల్ మందుతో మూడు రోజుల పరిశీలనలో 69 శాతం మందికి నెగిటివ్ రావడం శుభసూచకం. అలాగే 7 రోజుల్లో వంద శాతం మంది కోలుకున్నారు. మందును తీసుకురావడంలో మా శాస్త్రవేత్తలు చేసిన కృషి అభినందనీయం’ అని రాందేవ్ పేర్కొన్నారు. కొరోనిల్ మాత్రల ద్వారా 14 రోజుల్లో కరోనాను నయం చేయవచ్చని పతంజలి సంస్థ పేర్కొంది. తమ మందు 5 నుంచి 14 రోజుల్లో కొవిడ్‌ను నయం చేయగలదని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more