SBI SO notification 2020 Selections రాత పరీక్ష లేకుండా.. ఎస్బీఐలో స్పెషలిస్టు ఆఫీసర్ల భర్తీ

Sbi so notification 2020 registration begins no exam for selection

State Bank of India, SBI Specialist Cadre Officers recruitment, SBI Special Officers, sbi.co.in careers, sbi.co.in, sbi so notification 2020, SBI Recruitment 2020, SBI recruitment, sbi careers. SBI Special Officer selections, sbi.co.in, sbi so selection without exam, written exam, sbi so notification 2020, SBI Recruitment 2020

State Bank of India commenced the online application process for the Specialist Cadre Officers recruitment on its official website. The interested candidates can apply online for the SBI SO recruitment 2020 through the SBI's authorised portal - sbi.co.in - up to July 13.

రాత పరీక్ష లేకుండా.. ఎస్బీఐలో స్పెషలిస్టు ఆఫీసర్ల భర్తీ

Posted: 06/25/2020 08:24 PM IST
Sbi so notification 2020 registration begins no exam for selection

కరోనా కల్లోల సమయంలో పరిస్థితులన్నీ తారుమారు అవుతున్నాయి. ఉద్యోగులకే వేతనాల్లో కోతలు విధిస్తున్న పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఇక ప్రైవేటు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అయితే ఈ సమయంలోనూ నిరుద్యోగులకు శుభవార్తను అందించింది దేశీయ దిగ్గజ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ). తాజాగా కష్టకాలంలోనూ నిరుద్యోగులకు ఆశలను చిగురింపజేసింది. తమ బ్యాంకులో దేశవ్యాప్తంగా ఖాళీగా వున్న 444 స్పెషలిస్టు ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు జులై 13లోగా దరఖాస్తు చేయాలని ప్రకటించింది.

తమ బ్యాంకు వెబ్ సైట్ డబ్యూడబ్యూడబ్యూ డాట్ ఎస్బిఐ డాట్ సిఒ. ఇన్ (www.sbi,co,in)లో లాగిన్‌ అయి దరఖాస్తులు చేయొచ్చని సూచించింది. దరఖాస్తు చేసే అభ్యర్థులు రెజ్యుమ్‌, గుర్తింపు, వయసు ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత, అనుభవానికి సంబంధించిన పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగార్థులు ఎలాంటి పరీక్ష రాయనవసరం లేదు. ఎస్బీఐ కమిటీ అభ్యర్థులను షార్ట్ లిస్ట్‌ చేసి 100 మార్కులకు ముఖాముఖి నిర్వహిస్తుంది. అందులో అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. ఏ ఇద్దరికైనా కటాఫ్‌ మార్కులు సమానంగా వస్తే వయసు ఆధారంగా ఎంపిక ఉంటుంది.

కరోనా కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో రాత పూర్వక పరీక్షలు లేకుండా కేవలం మౌఖిక పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎస్బీఐ బ్యాంకులలో ఖాళీగా వున్న స్పెషల్ ఆఫీసర్ పోస్టులతో పాటు ప్రోడక్షన్ హెడ్ పోస్టు, సెంట్రల్ రిసర్చ్ టీమ్ పోస్టు, డాటా అనాలటిక్స్, సెంట్రల్ రిసర్చ్ టీమ్ సపోర్టు, ఇన్వెస్ట్ మెంట్, ప్రాజెక్టు స్పెషలిస్టు, రిలేషన్ షిఫ్ మేనేజర్, పోస్టులతో పాటు పలు బ్యాక్ లాగ్ పోస్టులకు కూడా ఎంపిక చేయనుంది, పోస్టులకు సంబంధించిన వేతనాల ఫ్యాకేజీ వివరాలు కూడా ప్రకటన సందర్భంగా వెలువరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles