తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న కేసుల్లో అంతర్జాతీయ నగరంగా పేరోందుతున్న హైదరాబాద్ నగరంలోనే అధికంగా పెరగుతుండటం కలవరాన్ని రేపుతోంది. వీటికి తోడు మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణవాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. ప్రతీ రోజు రాష్ట్రంలో మరణాలు సంభవిస్తుండడం అందోళన కలిగిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఇదివరకు ఎన్నడూ నమోదు కాని అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఏకంగా రోజురోజుకూ కోరానా పాజిటివ్ కేసులు అధికంగా నిర్థారణ కావడం.. భాగ్యనగర ప్రజ జీవితాలను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఆ తరువాత దేశ రాజధాని నగరంలో ఢిల్లీలో ఇప్పటికే అల్లకల్లోలాన్ని రేపుతున్న కరోనా.. ఇటు కోల్ కత్తా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లలోనూ అందోళన రేకెత్తిస్తున్నాయి.
హైదరాబాద్ నగరంతో పాటు పోరుగు జిల్లాల్లోనూ కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి సహా పలు జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి, తాజాగా నమోదైన కేసుల వివరాలు చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. రాష్ట్రంలో నమోదైన కేసులు 7.802 అయితే ఒక్క హైదరాబాదులోనే 4,868 పాజిటివ్ కేసులు ఉండడం అధికారులను ఆందోళనకు గురి చేస్తుంది. కరోనా మరణాల్లో కూడా ఒక్క హైదరాబాదులోనే 80 శాతం నమోదుకావడం పరిస్థితి తీవ్రతను వివరిస్తుంది. ఆసిఫ్ నగర్, బంజారాహిల్స్, గోషామహల్, పంజాగుట్ట ప్రాంతాల్లో కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. లాక్డౌన్ అమలుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా హైదరాబాద్ లో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. లాక్డౌన్ అనంతరం కేసుల సంఖ్య పెరిగింది.
వైరస్ వ్యాప్తిని నిరోధించడం కోసం కంటైన్మెంట్ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికే 154 కంటైన్మెంట్ ప్రాంతాలు ఉన్నాయి. కాగా, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కరోనా టెస్ట్ చేయించుకోవచ్చు అని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కరోనా అనుమానంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో టెస్ట్ చేయించుకోవాడినికి నగరానికి వస్తున్నారు. దాంతో ఆస్పత్రులన్నీ కరోనా అనుమానితులతో రద్దీగా ఉన్నాయి. గాంధీ ఆస్సత్రిలో, ప్రకృతి వైద్యశాలలో, ప్రైవేటు ఆస్పత్రులలో కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో బెడ్స్ ఖాళీగా లేవు. దీంతో ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని అంచనా వేయడం కష్టంగా మారింది.
ఖైరతాబాద్ జోన్
--------------
కార్వాన్ - 662
గోషామహల్ - 497
మెహదీపట్నం - 475
జూబ్లీ హిల్స్ - 369
ఖైరతాబాద్ - 351
చార్మినార్ జోన్
--------------
మలక్ పేట - 302
ఫలక్ నుమా - 285
చార్మినార్ - 256
చంద్రాయణ గుట్ట - 251
సంతోష్ నగర్ - 163
సికింద్రాబాద్ జోన్
--------------
అంబర్ పేట్ - 335
సికింద్రాబాద్ - 304
బేగంపేట - 256
ముషీరాబాద్ - 174
మల్కగిరి - 165
శేరిలింగంపల్లి జోన్
--------------
శేరిలింగంపల్లి - 152
పటాన్ చెరువు - 104
ఆర్‌సి పురం - 72
యూసుఫ్ గుడా - 70
ఎల్బీ నగర్ జోన్
--------------
సరూర్ నగర్ - 140
ఎల్బీ నగర్ - 104
కాప్రా - 62
ఉప్పల్ - 32
హయత్‌నగర్ - 45
కుకట్ పల్లి జోన్
--------------
అల్వాల్ - 71
మూసాపేట - 61
గజులరామరం - 49
కుకట్ పల్లి- 33
కుత్బుల్లాపూర్ - 43
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more