COVID-19 tests stalled in private labs in Hyderabad ప్రైవేటు ల్యాబ్ లలో కరోనా పరీక్షలు నిలిపివేత

Private labs to stall covid 19 tests till july five in hyderabad

private lab covid tests, covid-19, telangana, coronavirus, private labs in Hyderabad, private labs in Hyderabad, Private labs stall COVID-19 tests, coronavirus Hyderabad, Hyderabad coronavirus, Covid 19 private labs in Hyderabad

Private labs in Hyderabad have voluntarily announced stalling COVID-19 tests in Hyderabad from July 2 to July 5. The labs decided to collect the samples for four days in order to train the staff and disinfect the labs. It is known that the ICMR has accorded permission to the 18 private labs in Telangana to conduct COVID-19 tests.

ప్రైవేటు ల్యాబ్ లలో కరోనా పరీక్షలు నిలిపివేత

Posted: 07/02/2020 10:37 PM IST
Private labs to stall covid 19 tests till july five in hyderabad

హైదరాబాద్‌ మహానగరంలో మరోమారు కరోనా పరీక్షలకు బ్రేకులు పడనున్నాయి. ఇటీవల ప్రభుత్వ అసుపత్రులలో ప్రభుత్వ అదేశాల మేరకు నిలిచిపోయిన కరోనా పరీక్షలు.. తాజాగా ప్రైవేటు ల్యాబ్ లోనూ నిలిచిపోనున్నాయి. అయితే ఇది కూడా తాత్కాలికంగానేనని ప్రైవేటు ల్యాబులు ప్రకటించాయి. ప్రభుత్వ అసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకునేందుకు ముందుకురాని వారి కోసం ప్రైవేటు ల్యాబ్ లకు కూడా ప్రభుత్వం అనుమతులు కల్పించింది. అయితే ఇవాళ్టి నుంచి ఈ నెల 5వ తేదీ వరకు నాలుగు రోజులపాటు శాంపిల్స్‌ సేకరణ నిలిపివేస్తున్నట్టు ప్రైవేటు ల్యాబ్స్ వెల్లడించాయి.

ఇండియన్ కౌన్సిల్ ఆప్ మెడిసిన్ అండ్ రిసర్చ్ (ఐసీఎంఆర్‌) తెలంగాణ వ్యాప్తంగా 18 ప్రైవేటు ల్యాబ్ లకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతిచ్చింది. దీంతో గత 15 రోజుల నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ ప్రైవేటు ల్యాబులలో పలు వ్యతిరేక రిపోర్టులు వస్తున్నాయన్న పిర్యాదులు అందడంతో పాటు ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ అధికారుల బృందం కూడా కరోనా పరీక్షల నిర్వహణను పరిశీలించి.. లోపాలను గుర్తించింది. దీంతో లోపాలను తక్షణం సవరించుకోవాలని అదేశాలను జారీ చేసింది. అందుకుగాను 48 గంటల్లో సమయాన్ని కూడా కేటాయించింది. ఇప్పటికే కొన్ని ల్యాబ్ లు తప్పులను సరిదిద్దుకున్నాయి.

ఈ నేపథ్యంలో... కరోనా శాంపిల్స్‌ సేకరించే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు డిజ్‌ ఇన్‌ఫెక్షన్‌ కోసం నాలుగు రోజుల పాటు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు నిలిపివేస్తున్నట్టు ప్రైవేటు ల్యాబ్‌లు ప్రకటించాయి. ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది శాంపిల్స్‌ సేకరించి పంపిస్తే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపాయి. నేరుగా ల్యాబ్‌కు వచ్చి పరీక్షలు చేయించుకేనే అనుమానితుల శాంపిల్స్‌ మాత్రం సేకరించబోమని స్పష్టం చేశాయి. ఈనెల 6 నుంచి తిరిగి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించాయి. దీనికి సంబంధించి వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles