Pune man gets golden mask worth Rs 2.89 lakh కరోనా మాస్క్ ఖరీదు ఏకంగా రూ.2.89 లక్షలు..!

Gold standard of protection pune man gets mask made of gold worth rs 2 89 lakh

Coronavirus in Maharashtra, Coronavirus in Pune, Coronavirus in Pimpri Chinchwad, coronavirus, covid-19, mask made of gold, golden mask, Shanker kurade, Pimpri Chinchwad, Pune, Maharashtra

A Pune man has gone a little more extravagant and got a face mask made of gold that costs a whopping Rs 2.89 lakh. A resident of Pimpri Chinchwad of the Pune district, Shankar Kurade has gone overboard to protect himself and others around him with the gold face mask.

కరోనా మాస్క్ ఖరీదు ఏకంగా రూ.2.89 లక్షలు.. ప్రత్యేకతలేంటో తెలుసా.?

Posted: 07/04/2020 06:52 PM IST
Gold standard of protection pune man gets mask made of gold worth rs 2 89 lakh

కరోనా వైరస్ మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో దానినుంచి మనల్ని కాపాడుకునేందుకు ఉన్న ఏకైక మార్గం మాస్క్ ధరించడం.. శానిటైజర్లు వాడటం. దీంతో యావత్ ప్రపంచం మాస్కుల బాట పట్టింది. కాగా, మార్కెట్ లోకి రకరకాల మాస్కులు వచ్చాయి. బ్రాండ్ ను బట్టి వాటి ఖరీదు ఉంటుంది. కొన్ని మాస్కుల ధర 50 రూపాయల లోపు ఉంది. కొన్నింటి ఖరీదు వందలు, వేల రూపాయాల్లో ఉంది. కానీ ఆ మాస్క్ ధర మాత్రం ఏకంగా మూడు లక్షల రూపాయలంటే నమ్మశక్యమేనా.? కానీ ఇది నిజం. ఈ మాస్క్ ఖరీదు అక్షరాల రూ.2లక్షల 89వేలు. ఎందుకంత ఖరీదు.. ఏమిటీ దాని స్పెషలిటీ.? అనేగా మీ డౌట్.. అలాంటిదేం లేదు. కరోనా ముగిసిన తరువాత మాస్క్ అమ్మితే చాలు ఏకంగా దాని డబ్బులు అదే అర్జించేస్తుంది. అదే దాని ప్రత్యేకత.

అదెలా అంటే అది స్వర్ణఖచ్చితమైన మాస్క్. బోధపడిందా..? పూర్తిగా బంగారంతో చేయబడిన మ్కాస్క్ అది. అందుకనే దాని ధర అక్షరాల రూ.2లక్షల 89వేలు. ఈ మాస్క్ ధరను పక్కనబెడితే.. ఈ మాస్క్ తయారు చేయించుకుని ధరించి.. పుణెలోని పింప్రి-చించ్వాడ్ కు చెందిన శంకర్ కురాడే అంతకుమించిన పబ్లిసిటీ సాధించాడు. ఏకంగా జాతీయ మీడియాలో కూడా హైలైట్ అయ్యాడు. ఇక స్థానిక వార్తల్లోకి ఎక్కితేనే పబ్లిసిటీకి డోకా వుండదు. అలాంటిది ఏకంగా జాతీయ మీడియాను అకర్షించాడు శంకర్. ఈ మాస్క్ లో చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి. దీంతో శ్వాస తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదని అతడు చెప్పాడు. అయితే కరోనా వైరస్ నుంచి కాపాడటంలో ఈ మాస్క్ ప్రభావవంతంగా పని చేస్తుందో లేదో అనే విషయం మాత్రం తనకు తెలియదని శంకర్ అన్నాడు.

కాగా, శంకర్ ఒంటి నిండా బంగారం కనిపిస్తోంది. ఆయన చేతికి బంగారంతో చేసిన కడియం ఉంది. ఇక ఐదు వేళ్లకు ఐదు బంగారు ఉంగరాలు ఉన్నాయి. దీన్ని బట్టి శంకర్ బాగా రిచ్ అనే విషయం అర్థమవుతోంది. అయితే ఇన్ని రోజులు వేరు ఇకపై వేరు అన్నట్లు కరోనా తీసుకువచ్చిన కష్టాల నేపథ్యంలో ఆదాయాలు కోల్పోయిన అనేకులు కాయాకష్టానికైనా రెడీ అంటూ కూరగాయాలు, పండ్లు విక్రయాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా ఈజీ మనీ కోసం వెంపర్లాడే జనం కూడా మన సమాజంలో పుష్కలంగానే వున్నారు. అలాంటి వారి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు శంకర్ కి సూచిస్తున్నారు. అసలే బంగారం ధర భగభగమంటోంది. తులం స్వర్ణం రూ.50వేలు పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో దొంగలతో జాగ్రత్త అని చెప్పారు.

కాగా కొందరు నెటిజన్లు శంకర్ తీరుపై విమర్శలు చేశారు. డబ్బు ఉంది కదా అని ఇలా ఓవరాక్షన్ చేయడం కరెక్ట్ కాదన్నారు. ఆ మాస్క్ తయారీకి అయిన 2లక్షల రూపాయలతో వేల సంఖ్యలో గుడ్డతో చేసిన మాస్కులు కుట్టించి పేదవారికి ఉచితంగా పంచొచ్చు కదా అని ఒక నెటిజన్ సలహా ఇచ్చాడు. దేశంలో ఆర్థిక అసమానతలకు ఇది నిలువెత్తు నిదర్శనం అని మరొకరు కామెంట్ చేశారు. డబ్బు ఉన్నంత మాత్రాన ఇలా బిల్డప్ ఇవ్వడం కరెక్ట్ కాదని మరొకరు మండిపడ్డారు. మాస్కు మాత్రమే కాదు గోల్డ్ తో పీపీఈ కిట్ కూడా చేయించుకోకపోయావా అని మరో నెటిజన్ సెటైర్ వేశాడు. కాగా, పింప్రి-చించ్వాడ్ లో కరోనా కేసుల సంఖ్య 3వేల 284కి పెరిగింది. కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 47కి చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  mask made of gold  golden mask  Shanker kurade  Pimpri Chinchwad  Pune  Maharashtra  

Other Articles