కర్నూలు జిల్లాకు రాజుల పాలనకు సంబంధించిన విషయాలు చరిత్రలోకి తొంగిచూస్తే తెలుస్తాయి కానీ.. జిల్లాకు వరుణుడికి.. భూమికి.. రత్నాలకు మాత్రం తప్పకుండా లింక్ ఏదో వుంది. తొలకరి జల్లులు పడిన నాటి నుంచి వర్షకాలంలో భారీ వర్షాలు పడే వరకు ఇక్కడ వజ్రాలు లభ్యమవుతాయన్నది కాదనలేని సత్యం. తాజాగా జిల్లాలోని తుగ్గలి మండలంలో మరో వజ్రం లభ్యమైంది. ఈసారి పగిడిరాయిలో ఓ గొర్రెల కాపరిని అదృష్టం వరించింది. ఆయనకు వజ్రం దొరికింది. ఈ విషయం గ్రామంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆరా తీయగా, సదరు గొర్రెల కాపరి ఆ వజ్రాన్ని స్థానిక వ్యాపారికి అత్యంత చౌకధరకు విక్రయించాడని తెలుస్తోంది. ఆ వజ్రం విలువ ఎక్కువ ఉంటుందని సమాచారం.
అయితే ఇంతకీ వజ్రం అసులు విలువ ఎంతో మాత్రం తెలియదు కానీ గొర్రెల కాపరికి మాత్రం వజ్రానికి రూ.3.60 లక్షలు ముట్టాయని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గొర్రెల కాపరిని మోసం చేసి వజ్రాల వ్యాపారి తక్కువ ధరకే దాన్ని కొన్నట్టు స్థానికులు అనుకుంటున్నారు. గొర్రెల కాపరికి వజ్రం దొరకడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ప్రాంతంలో ఈ సీజన్ లో వజ్రాలు దొరకడం చాలా కామన్ అని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే పలువురికి విలువైన వజ్రాలు లభించినట్టు వార్తలు వచ్చాయి. ఆ ప్రాంతంలో తొలకరి జల్లులు పడితే చాలు భూమి నుండి వజ్రాలు బయటకు వస్తాయి. రత్నాల పంటలే పండుతాయి. చినుకు పడితే చాలు వజ్రాలు నేలను చీల్చుకొని ఆకాశం వైపు చూస్తాయి.
రాయలసీమ రాత్నాల సీమ అన్న నానుడికి నామసార్థకం చేసేలా కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని కొన్ని గ్రామాల్లో తొలకరికి వజ్రాలకు సంబంధాలు వున్నాయి. ఇక వర్షాకాలం వచ్చింది తొలకరి జల్లులు పడ్డాయి అంటే ఊళ్లకు ఊళ్లు జనం భూముల్లో అన్వేషణ సాగిస్తుంటారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. ఇక్కడ తొలకరి పలకరింపు కొంతమందిని లక్షాధికారులుగా మారుస్తుంది. అయితే అది వారి అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. వానాకాలం వచ్చిందంటే కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని పలు గ్రామాల్లో వజ్రాల వేట మొదలవుతుంది. పొలాల్లో వజ్రాలు పోలిన రాళ్లలో నిజమైన వజ్రాలు దొరుకుతుంటాయి.
వజ్రాలను వెతకడానికి స్థానికులు, చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుండి సైతం ఇక్కడికి వస్తుంటారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. మహిళలు చంటి బిడ్డలతో వచ్చి మరీ వజ్రాల కోసం వెతుకుతుంటారు. ఎన్నో ఏళ్లుగా ఈ వజ్రాల వేట కొనసాగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటిదాకా ఆ ప్రాంతాల్లో వందల సంఖ్యలో వజ్రాలు దొరికాయి. గత నెల రోజుల వ్యవధిలో సుమారు 6 వజ్రాలు దొరికాయని తెలుస్తోంది. కాగా, ఈ వజ్రాల వేట స్థానిక రైతులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎక్కడెక్కడ నుంచో వస్తున్న జనం డైమెండ్స్ కోసం పొలాలను ఇష్టానుసారంగా తొక్కేస్తున్నారట. దీంతో పొలం దున్నేటప్పుడు తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. అయితే ఎన్ని వజ్రాలు లభించినా సామాన్యులకు లభించేది చిటికెడు లాభమే.. మిగతాదంగా మధ్యవర్తుల పరమే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more