Details of Private Trains in Indian Railways సికింద్రాబాద్, విశాఖ నుంచి కూతెట్టనున్న ప్రైవేటు రైళ్లు

14 routes identified for private trains by south central railway

indian railways, indian railways news, full list of private trains, indian railways private trains, privatisation of railways in india, tejas express, railway privatisation, privatisation of railways,indian railways, private trains, south central railway, secundrabad cluster, telugu states

Indian Railways passengers can certainly look forward to faster, more comfortable and world-class travel experience in the coming years.

సికింద్రాబాద్, విశాఖ నుంచి కూతెట్టనున్న ప్రైవేటు రైళ్లు

Posted: 07/06/2020 10:26 PM IST
14 routes identified for private trains by south central railway

భారతీయ రైల్వేల ప్రైవేటీకరణకు తెరలేచిన నేపథ్యం.. కరోనా సమయంలో ప్రజలు మహమ్మారి గురించి తప్ప ఏ విషయాన్ని పట్టించుకోని సమయం చూసుకుని కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కిస్తోంది. దశల వారిగా ప్రైవేటు రైళ్లు పరుగులు తీయనున్నాయి. మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో రైళ్లను నడిపేందుకు ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తూ భారతీయ రైల్వే ‘ఆర్‌ఎఫ్‌క్యూ(రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్’-RFQ) ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అన్నీ సవ్యంగా జరిగితే మరో మూడేళ్లలో ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ రైల్వే మార్గాలైన సికింద్రాబాద్ నుంచి, విశాఖ నుంచి ప్రైవేటు రైళ్లు పరుగులు తీయనున్నాయి.

అత్యధిక భాగం సికింద్రాబాద్ నుంచే:

 

కాగా, తెలుగు రాష్ట్రాల్లో 20 రూట్లలో ప్రైవేటు రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. వీటిలో అత్యధిక భాగం సికింద్రాబాద్ నుండి ప్రారంభమయ్యేవి ఉన్నాయి. రైల్వేశాఖ జారీ చేసిన అభ్యర్థనలో ఈ విషయం తెలిపింది. రైళ్ల ప్రైవేటీకరణలో నిజానికి ఈ ప్రక్రియే అత్యంత కీలకమైనది. లాభదాయకమైన రూటు కాకపోతే రైళ్ల నిర్వహణకు ప్రైవేటు ఆపరేటర్ ముందుకు వచ్చే అవకాశమే లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది. ప్రైవేటు ఆపరేటర్ల కోసం దేశవ్యాప్తంగా 109 జతల రూట్లను గుర్తించింది. వీటిలో ఏపీ-తెలంగాణల్లో 20 ఉన్నాయి. దీనికోసం ప్రస్తుతమున్న భారతీయ రైల్వే వ్యవస్థను 12 క్లస్టర్లుగా కేంద్రం విభజించింది. క్లస్టర్ల వారీగా ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాల్సిన రూట్లను గుర్తించింది.

క్లస్టర్లు ఇవి:

 

* దేశంలోని రైల్వే నెట్ వర్క్ ను మొత్తం 12 క్లస్టర్లుగా విభజణ.

* వీటిలోని 109 మార్గాల్లో 218 ప్రైవేటు రైళ్లను నడిపించాలనే ప్రతిపాదనలు.

* వీటికి కేవలం గార్డ్, డ్రైవర్‌‌లను మాత్రమే భారతీయ రైల్వే అందించనుంది.

ముంబైని రెండు క్లస్టర్లుగా రైల్వేశాఖ గుర్తించింది. మొదటి క్లస్టర్ లో 16 రూట్లు, రెండో క్లస్టర్ లో 23 రూట్లను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించనున్నారు. అదే విధంగా ఢిల్లీ-1 క్లస్టర్ లో 14, ఢిల్లీ-2 క్లస్టర్ లో 12, చండీగడ్ క్లస్టర్ లో 17, హౌరాలో 22, పాట్నాలో 20 రూట్లను ప్రైవేటుకు అప్పగించనున్నట్లు రైల్వే శాఖ నోటిఫికేషన్ లో తెలిపింది. ప్రయాగ్ రాజ్ క్లస్టర్ లో 26, సికింద్రాబాద్ లో 20, జైపూర్ క్లస్టర్ లో 18, బెంగళూరులో 10 రూట్లను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించనున్నారు.

షరతులు:

 

* గంటకు కనీసం 160 కిమీ వేగంతో ప్రయాణం చేసేలా రైళ్లను రూపొందించాలని ప్రైవేట్ ఆపరేటర్లకు కేంద్ర ప్రభుత్వం షరతు.

* దీంతో పాటు ఆ మార్గంలో అప్పటివరకు నడుస్తున్న అత్యంత వేగవంతమైన రైలు కన్నా ఎక్కువ వేగంతో ప్రైవేటు రైలు తిరగాలి.

* టికెట్ ధర నిర్ణయంతో పాటు ఆహారం, దుప్పట్ల సరఫరా, పరిశుభ్రతను ప్రైవేటు ఆపరేటర్లే చూసుకోవాలి.

* డ్రైవర్, గార్డులను మాత్రం రైల్వే శాఖ నియమిస్తుంది. వీరు రైల్వే శాఖ ఉద్యోగులుగానే ఉంటారు.

* మిగిలిన నిర్వహణ బాధ్యతలన్నీ ప్రైవేటు వారే చూసుకోవాలి. అయితే, భవిష్యత్తులో డ్రైవర్, గార్డులను నియమించే బాధ్యత నుంచి కూడా రైల్వే శాఖ తప్పుకుంటుందని సమాచారం.

ప్రైవేటు రైళ్ల మార్గాల వివరాలు..

 

1. సికింద్రాబర్ టు శ్రీకాకుళం (వయా విశాఖ) 13.45 గంటలు (19.45-9.30

2. శ్రీకాకుళం టు సికింద్రాబాద్ (వయా విశాఖ) 14 గంటలు (15.00-05.00)

3. సికింద్రాబాద్ టు తిరుపతి 12.15 గంటలు (06.00-18.15)

4. తిరుపతి టు సికింద్రాబాద్ 12.15 గంటలు (08.40-20.55)

5. గుంటూరు టు సికాంద్రాబాద్ 4.45 గంటలు (23.30-04.15)

6. సికింద్రాబాద్ టు గుంటూరు 4.45 గంటలు (23.30-04.15)

7. గుంటూరు టు కర్నూలు 8 గంటలు (06.00-14.00)

8. కర్నూలు టు గుంటూరు 7.40 గంటలు (14.50-22.30)

9. తిరుపతి టు వారణాశి (వయా సికింద్రాబాద్) 33.45 గంటలు (22.00-7.45)

10. వారణాశి టు తిరుపతి (వయా సికింద్రాబాద్) 33.15 గంటలు (9.45-21.00)

11. సికింద్రాబాద్ టు ముంబై (11.20 గంటలు) (22.25-9.45)

12. ముంబై టు సికింద్రాబాద్ (11.45 గంటలు) (23.35-11-20)

13. ముంబై టు ఔరంగాబాద్ 6 గంటలు (15.45-21.45)

14. ఔరంగబాద్ టు ముంబై 6.10 గంటలు (6.15-12.25)

15. విశాఖపట్నం టు విజయవాడ 6.05 గంటలు (8.40-14.45)

16. విజయవాడ టు విశాఖపట్నం 6.05 గంటలు (16.00-22.06)

17. విశాఖపట్నం టు బెంగళూరు (వయా రేణిగుంట) 16.45 గంటలు (19.45-12.30)

18. బెంగళూరు టు విశాఖపట్నం 17.55 గంటలు (18.00-11.55)

19. హౌరా టు సికింద్రాబాద్ 22.50 గంటలు (18.40-20.00)

20. సికింద్రాబాద్ టు హరా 25.30 గంటలు (05.00-06.30)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles