ప్రమాదకారి కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలను కబళించి.. మరణమృదంగాన్ని మ్రోగిస్తున్న తరుణంలో దానిని కట్టడి చేయడానికి ఇప్పటికే పలు ఔషదాలు వచ్చినా ఇంకా మరణాలు మాత్రం అగడం లేదు. ఈ క్రమంలో రెమిడెసివీర్ మందును సిప్లా, హెటరోలతో పాటు పలు కంపెనీలు ఔషదాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అయినా కరోనా ప్రభావం అధికంగా వున్న బాధితుల్లో ఈ వైరస్ అదుపు చేయడానికి వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నా.. వారిలో మాత్రం గుణం కనిపించకపోవడంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది. దీంతో వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఈ పరిస్థితులకు చేరిన రోగులకు సంజీవనిలా మారింది మరో దివ్యౌషధం. తీవ్రమైన శ్వాసకోశ బాధలతో ఇబ్బంది పడుతున్న రోగులకు చికిత్స చేయడానికి “పరిమితం చేయబడిన అత్యవసర ఉపయోగం” కోసం చర్మ వ్యాధి సోరియాసిస్ ను నయం చేయడానికి ఉపయోగించే మెడిసిన్ ఇటోలిజుమాబ్ తో గుణం కనిసిస్తోంది. కరోనా రోగులపై జరిపిన క్లినికల్ ట్రయల్స్ లోనూ సంతృప్తికర పలితాలు రావడంతో భారత డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ కూడా ఈ మందును తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులను ఎదర్కొంటున్న కరోనా పేషంట్స్ కు ఈ మందును వినియోగించేందుకు అనుమతించింది. ఈ మేరకు అమోదం తెలిపింది. దీంతో తీవ్రమైన కరోనా ఇన్ఫెక్షన్కు గురైన వారిపై ‘ఇటోలీజుమ్యాబ్’ ను వైద్యులు వినియోగిస్తున్నారు.
ఇటోలిజుమ్యాబ్ మందు కరోనా రోగులపై ప్రభావవంతంగా పనిచేస్తోందని, వెంటిలేటర్ దశ నుంచి కూడా కొందరు సాధారణ స్థితికి చేరుకున్నట్లు నిపుణుల కమిటీ వెల్లడించింది. దీంతో కోవిడ్-19 చికిత్సకు అపరిమితమైన వైద్య అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇటోలీజుమ్యాబ్ ఇప్పటికే చాలా ఏళ్లుగా సోరియాసిస్ చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. అయితే ఈ మెడిసిన్ వినియోగానికి ముందు ప్రతి రోగి లిఖితపూర్వక సమ్మతి అవసరం ఉంది. ఇటోలీజుమ్యాబ్ మందును భారత్కు చెందిన బయోకాన్ సంస్థ తయారు చేస్తోంది. ఈ మందు ఒక్క డోసు ధర రూ.60 వేలు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more