Junior college courses to turn as plus two in AP ఇంటర్ విద్యపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

Intermiediate college courses to turn as plus two in andhra pradesh school education

AP Government, School Education, Intermediate colleges, Plus Two, CBSE pattern, YS Jagan, Junior colleges, Andhra Pradesh, Politics

Andhra Pradesh Government has taken a key decision on Inter Colleges Education by turning the college courses into plus two course as a part of school education, just as CBSE.

ఏపీలో ప్లస్ టు గా మారనున్న ఇంటర్ విద్య.. సర్కార్ కీలక నిర్ణయం

Posted: 07/14/2020 07:26 PM IST
Intermiediate college courses to turn as plus two in andhra pradesh school education

(Image source from: Thehansindia.com)

రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో పలు మార్పులు చేసుకుంటూ వస్తోన్న జగన్ సర్కార్.. మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని కార్పోరేట్ కాలేజీల ధన దోపిడి పూర్తిస్థాయిలో చెక్ పెట్టేందుకుఈ నిర్ణయం దోహదపడుతున్నట్లు సమాచారం. ఇంటర్ విద్యాలో కార్పోరేట్ కాలేజీ యాజామాన్యాల జోక్యం అధికమైందన్న అరోపణలు సర్వత్రా వినిపిస్తున్న తరుణంలో.. ప్రైవేటు, కార్పోరేట్ కళాశాలపై కోరడా ఝుళిపించేందుకు రాష్ట్ర సర్కార్ సన్నధమవుతున్నట్లు సమాచారం. ఇక దీంతో పాటు ఇంటర్ కాలేజీల సంఖ్యను కూడా పెంచుతున్నట్లు తెలుస్తోంది.

పదో తరగతి విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న హైస్కూళ్లను జూనియర్‌ కాలేజీలుగా అప్ గ్రేడ్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా మండల కేంద్రంలోని  హైస్కూళ్లను ఇంటర్‌‌ కాలేజీలుగా అప్ గ్రేడ్‌ చేయనున్నారు. దీనిపై గత వారంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. పదో తరగతి పాసైన చాలా మంది ఇంటర్‌ చదివేందుకు ఎందుకు ఉత్సాహం చూపడం లేదన్న అంశం వారి సమావేశంలో చర్చకు వచ్చింది. దూరభారం వల్లే ఈ సమస్య వస్తోందని ఆ సమావేశంలో సభ్యులు, అధికారులు అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలో మండల స్థాయిలోనే ఇంటర్ కాలేజీలు ఏర్పాటు చేస్తే అడ్మిషన్లను గణనీయంగా పెంచొచ్చని ఉన్నాతాధికారులు భావించారు. ఇదే విషయంపై సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో జిల్లాల్లోని మండల కేంద్రాల్లో ఉన్న హైస్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఆ తరువాత ఇంటర్ కాలేజీ వ్యవస్థలను ప్లస్ టు గా కూడా మర్చే ప్రక్రియపై యోచిస్తున్నట్లు సమాచారం. సీబీఎస్ఈ తరహాలో పదో తరగతితో పాటే ఇంటర్ విద్యాను కూడా అందించేలా నిర్ణయం తీసుకునేలా కూడా అలోచనలు సాగుతున్నయాని తెలుస్తోంది. అయితే ఇది మార్పులు ఉన్నపళంగా చేయనున్నారా లేక అంచెలవారీ విధానాలతో చేయనున్నారా అన్నది వేచి చూడాల్సింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles