ఎంతటివారైనా సవాల్ విసిరే సందర్భంలో.. ఓరేయ్ నువ్వు నిజంగా మగాడివే ఐతే.. మూతి మీద మొలిచింది మీసమే ఐతే.. అంటూ హుంకారాలు పోవడం కొత్తేమీ కాదు. అయితే ఈ కాంత వద్ద మాత్రం అలాంటి పుప్పులు వుడకవ్. అడవిదారిలో వెళ్తున్న అమెను అనుకోకుండా వచ్చిన అతిధి పలకరిస్తే.. అమె ఎంతో గుండె నిబ్బరంతో,. ఎంతో ధైర్యంగా ఆ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. అతిధే వస్తే అంత బిల్డప్ ఎందుకంటారు కాబోలు.. ఇక్కడ వచ్చిన అతిధి మరెవరో కాదు భళ్లూకము. అదేనండీ ఎలుగుబంటి. నిశ్చేష్టులుగా నిల్చోవలసిన సమయంలో ఎలుగుబంటి అమ్మాయి వద్దకు వెనుకగా వచ్చి నిల్చుని సెల్ఫీ తీయించుకుని వెళ్లిపోయింది. అదృష్టం ముందు వెనుక వున్న కొందరు చప్పుడు చేయడంతో ఆ యువతిపై ఎలాంటి దాడికి పాల్పడకుండా వెళ్లిపోయింది.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్)కు చెందిన అధికారి సుశాంత నందా ట్వీట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలను చూసిన నెటిజనులు విస్మయానికి గురవుతున్నారు. ఔరా ఈ యువతిలో ఎదో జాదూ(మాయ) వుంది అని చమత్కరిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే మెక్సికో లోని సాన్ పెడ్రో గర్జా గార్సియా ప్రాంతంలోని చింపిన్ క్యు అడవిలో నడుచుకుని వెళ్తున్న ఓ బృందానికి అకస్మాత్తుగా ఎలుగుబంటి ఎదురైంది. వారిలో విడిగా నడుచుకుని వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలకు వద్దకు వెళ్లి అది ఆగింది. దీంతో ఆ అమ్మాయిలు తెలివిగా కదలకుండా అక్కడే నిలిచిపోయారు. ఎందుకంటే.. ఆ సమయంలో కంగారు పడి కదిలినా, పరుగులు పెట్టినా ఎలుగుబంట్లు దాడి చేసి.. శరీరాన్ని చీల్చేస్తాయి.
ఈ విషయం తెలిసిన యువతులిద్దరూ అక్కడే కదలకుండా అలా నిలబడిపోయారు. వాళ్లను సమీపించిన ఎలుగుబంటి రెండు కళ్లతో పైకి లేచి నిలబడింది. ఆ సమయంలో యువతి చేతిలో ఉన్న ఫోన్ చూసి మంచి పోజు ఇవ్వాలని అనుకుందో ఏమో.. ఆమె వెనకాలే నిలుచుని సెలబ్రిటీ తరహాలో సెల్ఫీ తీయించుకుంది. ఆ తర్వాత ఆమెను ఏమీ చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయింది. అదీనూ సెల్పీ తీసిన తరువాత అమె చేయి కదులుతున్నా ఏ హాని తలపెట్టకుండా వెళ్లిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజనులు.. జంతువులకు కూడా సెల్ఫీ పిచ్చి పెరిగిపోయినట్లుందని కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే.. అమ్మాయిల ముందు ఎంత క్రూర జంతువైనా పిల్లిలా మారిపోతాయని అంటున్నారు. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
Difficult to make out
— Susanta Nanda IFS (@susantananda3) July 19, 2020
Whether the bear took liking to the girl more or to the selfie.. pic.twitter.com/qYJDgiN6KT
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more