ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న కరోనా మహమ్మారి పేరు చెబితేనే అటు ప్రభుత్వాలు.. ఇటు సాధారణ ప్రజల వరకూ అందరూ వణికిపోతుంటే.. ఈ మాయగాడు మాత్రం దానితో కూడా సిల్లి గేమ్స్ అడేసి.. సోమ్ము చేసుకున్నాడు. పాపం పండిన తరువాత ఎంతటివారైనా అరదండాలు తప్పవన్న విషయం పోలీసుల అదుపులో వెళ్లగానే బోధపడింది. ఇంతకీ ఈ ఘనుడు ఆడిన సిల్లీ గేమ్స్ ఏంటో తెలుసా.? కరోనా మహమ్మారి సోకి రెండవ, మూడవ దశలో వున్న రోగులకు తన ఫ్లాస్మాను దానంగా ఇస్తానని రోగుల బంధువులను నమ్మించి వారి నుంచి దారి ఖర్చులంటూ, కరోనా జయించేందుకు అత్యవసరమైన మూలికలంటూ మోసాలకు తెరలేపాడు.
నేను కరోనాను జయించాను.. ప్లాస్మా దానానికి సిద్ధం అంటూ ఏకంగా 200 మంది మోసగించిన కేటుగాడిని ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరా్లలోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పోనూగూటివలసకు చెందిన రెడ్డి సందీప్(25) నాలుగేళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం అన్వేషణ సాగించాడు. ఉద్యోగాలు లభించినా జీతం పెద్దగా లేదు. జీతం పెద్దగా వున్న ఉద్యోగాలకు అతని అనుభవం సరిపోదు. దీంతో ఉద్యోగం లభించక.. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో కన్నాలు వేయడమే ప్రవృత్తిగా మార్చుకున్నాడు. విశాఖపట్నంలోని టూ టౌన్ పోలిస్ స్టేషన్ తో పాటు, ద్వారకా పోలిస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కాడు.
కొద్ది నెలల పాటు జైలులో శిక్షను అనుభవించి సందీప్.. బయటికు వచ్చేసరికే కరోనా విజృంభిస్తోంది. పట్టభద్రుడు కావడంతో తన తెలివిని అక్రమంగానే వినియోగించుకున్నాడు. అంతే కరోనా మహమ్మారి బారిన పడిన వారు దానిని జయించిన వారి ప్లాస్మా సాయంతో కొలుకుంటారన్న వార్తను తెలుసుకున్నాడు. తన మెదడుకు పదను పెట్టి.. ప్లాస్మాకు ఏర్పడిన భారీ డిమాండ్ ను తాను సొమ్ము చేసుకోవాలని భావించాడు. అనుకున్నదే తడవుగా సోషల్ మీడియా ద్వారా నుంచి ప్లాస్మా అవసరమైన రోగుల వివరాలు.. వారి ఫోన్ నంబర్లను సేకరించాడు. కరోనా సోకడంతో అసలే తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆ కుటుంబానికి కాల్ చేసి వారిలో లేని ఆశలు రేపి.. మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు.
అదెలా అంటే తాను కరోనా పాజిటివ్ ను జయించానని, తన ప్లాస్మా దానానికి సిద్ధమని నమ్మబలికేవాడు. అయితే తాను ప్రస్తుతం దూరంగా వున్నానని, ఆసుపత్రికి చేరుకునేందుకు ప్రత్యేకంగా కారులో రావాల్సి వుంటుంది కాబట్టి తన రవాణా ఖర్చులు మీరే భరించాలంటూ కోరేవాడు. అవతలివైపు నుంచి ఆన్లైన్ ద్వారా డబ్బులు వేయించుకుని తీరా ముఖం చాటేసేవాడు. ఇదే తరహాలో కొవిడ్-19 నియంత్రణ ఔషధాల పేరిట కూడా మోసాలకు పాల్పడ్డాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ మోసగాడి జాడను కనిపెట్టి నగరంలో అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై బంజారాహిల్స్, రాంగోపాల్‌పేట్, సీసీఎస్, పంజాగుట్టలో ఇప్పటికే ఈ తరహా కేసులు నమోదైనట్లు గుర్తించారు. అనంతరం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more