Telugu TV Actress Rekha commits suicide ఆర్థిక ఇబ్బందులతో నటి రేఖా ఆత్మహత్య..

Telugu tv actress rekha commits suicide due to financial crisis

TV actress, Tv actress Rekha, Actress Rekha Suicide, Rekha financial crisis, TV chances, Real Estate, Guntur, Andhra Pradesh, Crime

Telugu TV Actress Rekha commits suicide due to financial crisis and of not getting chances in TV Industry. She is mentally disturbed ue to the debts made by husband, who invested a lot in Real Estate Feild.

ఆర్థిక ఇబ్బందులతో తెలుగు బుల్లితెర నటి రేఖా ఆత్మహత్య..

Posted: 07/23/2020 03:38 PM IST
Telugu tv actress rekha commits suicide due to financial crisis

రంగుల ప్రపంచంపై ఆశలు.. అక్కడికి తీసుకువెళ్లినా.. అక్కడ నిలదొక్కులేక తిరిగి ఇంటి బాట పట్టిన వారు చాలా తక్కువ మంది. కానీ ఇంతవరకు చేరినా అవకాశాలు దొరక్కపోవడం, చేతుల్లో చిల్లి గవ్వ కూడా లేక అర్థాకలితో బతకలేక జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్న వారు కూడా అధికం. అలాంటి వారి జాబితాలో మరో బుల్లితెర నటి కూడా చేరడం విషాధకరం. తనకు టీవీ రంగంలో అవకాశాలు అందకపోవడం, భర్త చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్తా కరోనా కలకలంతో గాడి తప్పడం.. అదే సమయంలో వ్యాపార నిమిత్తం చేసిన అప్పుల కోసం రుణాలు ఇచ్చిన వారి నుంచి కూడా ఒత్తిడి అధికమవ్వడం.. దీంతో తనలో తాను మదనపడుతూ మనాసిక ఒత్తిడికి గురైన నటి విపరీతమైన నిర్ణయాన్ని తీసుకుంది.

టీవీ నటి మద్దెల సబీరా, అలియాస్ రేఖ (42) ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన రేఖ నటనపై అభిమానంతో హైదరాబాద్ వచ్చి రెండు టీవీ సీరియళ్లలో నటించారు. అయితే, ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో తిరిగి గుంటూరు వెళ్లిపోయి అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కుమార్తె పుట్టిన తర్వాత మనస్పర్థలు రావడంతో భర్తతో విడిపోయారు. అనంతరం చైతన్యను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం విద్యానగర్‌లో ఉంటున్న రేఖ కొన్నాళ్లపాటు వేడుకల్లో పాటలు పాడడం, యాంకరింగ్ చేయడం వంటివి చేశారు.

అయితే, గత రెండేళ్లుగా అది కూడా మానేశారు. మరోవైపు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆమె భర్త చైతన్య నష్టాలపాలవడంతో రేఖ కుంగిపోయారు. చుట్టుముట్టిన కష్టాలతో కలత చెందిన ఆమె నిన్న స్నానం చేసేందుకు వెళ్లి బాత్రూములోనే ఆత్మహత్య చేసుకున్నారు. స్నానానికి వెళ్లిన భార్య ఎంతకీ బయటకు రాకపోవడంతో భర్త పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు పగలగొట్టి చూడగా ఆమె ఉరి వేసుకుని వేలాడుతూ ఉండటం గమనించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles