రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇవాళ కేంద్రంలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థలపై, వాటి పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. కేంద్రాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయ పన్ను శాఖ వంటి దర్యాప్తు సంస్థలు రాజస్థాన్ లో చాలా క్రియాశీలంగా పనిచేస్తున్నాయని నర్మగర్భవ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఈ స్వయం ప్రతిపత్తి కలిగిన స్వతంత్ర సంస్థలు దాడులకు భయపడతామా అంటూ హుంకరింపులకు పోతూ కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం వీటిని అడ్డుగా పెట్టుకుని అటలాడుతోందని విమర్శించారు. ఐటీ, ఈడీ, సీబిఐ దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
తన సోదరుడి ఇంటిపై ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో సీఎం ఇలా స్పందించారు. ఈ సంస్థలు ఎవరి కన్నుసన్నల్లో పనిచేస్తున్నాయో దేశ ప్రజలందరికీ అవగతమైందని అన్నారు. కేంద్రానికి అనుకూలంగా వ్యవహరించే వారిపై ఎన్ని అరోపణలు వచ్చినా ఈ సంస్థలు నిద్రపోతున్నట్టు నటిస్తాయని, అయితే కేంద్రం టార్గెట్ చేసుకున్న వ్యక్తుల విషయంలో రంద్రాన్వేషణ చేసే విధంగా ఆ సంస్థలు పనిచేస్తున్నాయని, ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని, క్షమించబోరని హెచ్చరించారు. ఇటీవల కాంగ్రెస్ విడుదల చేసిన ఆడియో టేపులపై మాట్లాడుతూ.. అవి నిజమైనవేనని, వాటిపై ఎలాంటి దర్యాప్తుకైనా తాము సిద్దమేనని అన్నారు.
ధర్మం, న్యాయం, అంటూ నీతి ప్రవచనాలు వల్లించే నాయకులు అవి కేవలం ప్రజలకు మాత్రమేనని.. తాము ఆచరించబోమని ఈ టేపులే రూడీ చేస్తున్నాయని అన్నారు. వారి మాట్లాడిన మాటలనే అంగీకరించలేని పరిస్థితుల్లోకి జారుకున్నారన్నారు. అయినా సరే ఆ టేపుల్లో ఉన్నది తమ గొంతు కాదని కొందరు వాదిస్తున్నారని గెహ్లాట్ అన్నారు. వారెన్ని చెప్పినా చివరికి సత్యమే గెలుస్తుందన్నారు. ఇక, అసెంబ్లీలో తమకు పూర్తి మెజారిటీ ఉందని, తామంతా ఐకమత్యంగానే ఉన్నామని సీఎం పేర్కొన్నారు. కొందరు ఎమ్మెల్యేలను బందీలుగా పెట్టుకుని వారికి బౌన్సర్లను కాపలాగా పెట్టారని, వారితో కూడా తాము టచ్లో ఉన్నామని అన్నారు. వారు కూడా తమ వెంటే ఉంటారని, తమకే ఓటు వేస్తారని గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more