Record time recovery by Vijayawada Police బెజవాడలో పట్టపగలు భారీ దోపిడి.. రికార్డు టైంలో చేధన..

Rs 4 crore stolen property recovered within hours in vijayawada by police

Vijayawada police, Robbery, Amaravati, major gold robbery, prakasam barrage, Gold Ornaments, silver ornament, Cash, Rajasthani, vikram kumar lohar, Rs 4 cr ornaments, Andhra pradesh, Crime

The Vijayawada police cracked a major gold robbery within hours in the city, on Friday. According to the police officials statement, they have identified and arrested the accused Vikram Kumar Lohar, aged 23 years and recovered the stolen property including 7 KGs of Gold ornaments, 19 KGs of silver ornaments apart from Rs 42 lakh liquid cash within hours after they noticed the crime.

బెజవాడలో పట్టపగలు భారీ దోపిడి.. రికార్డు టైంలో చేధన..

Posted: 07/24/2020 11:17 PM IST
Rs 4 crore stolen property recovered within hours in vijayawada by police

విజయవాడలో జరిగిన బంగారు ఆభరణాల దుకాణం కేసలో చోరిని పోలీసులు కేవలం గంటల వ్యవధిలో చేధించి శబాష్ అనిపించుకున్నారు. రికార్డు సమయంలో అత్యంత భారీ బంగారు ఆభరణాల దోపిడీని చేధించిన పోలీసులకు నగర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రముఖుల చేత కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. విజయవాడ నగరంలోని పాతబస్తీ కాటూరివారి వీధిలోని సాయిచరణ్ బంగారు దుకాణంలో భారీ దోపిడీ జరిగింది. పట్టపగలే దుండగులు రూపాయలు నాలుగు కోట్ల విలువైన 7 కిలోల బంగారం నగలు, 7 కిలోల వెండి ఆభరణాలు, రూ.42లక్షల నగదును దోచుకుని కారులో పారిపోబోయారు. ఈ వార్త తెలిసిన పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి కేసును చేధించడంతో దోంగలు ఊచలు లెక్కబెడుతున్నారు.

విజయవాడ వన్ టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జ్యువెల్లరీ వ్యాపారి శ్యాంకు పాతబస్తీ శివాలయం వీధిలో ‌నగల దుకాణం, కాటూరువారి వీధిలో వెండి వస్తువులు విక్రయించే దుకాణంలో భాగస్వామ్యం ఉంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇద్దరు వ్యక్తులు శివాలయం వీధిలోని జ్యువెల్లరీ షాపు వద్దకు నగలు కొనేందుకు వచ్చారు. లాక్ డౌన్‌ కావడంతో ఇక్కడ ఉన్న సరకును కాటూరువారి వీధిలోని దుకాణంలో ఉంచామని, కాసేపు వేచి ఉంటే అక్కడి నుంచి తెప్పిస్తామని మరొక వ్యాపార భాగస్వామి మనోహర్ ‌సింగ్‌ చెప్పారు. మనోహర్‌సింగ్‌ సూచనల మేరకు గుమాస్తా నగలు తెచ్చేందుకు కాటూరువారి వీధిలోని సాయి చరణ్ ఆభరణాల దుకాణం వద్దకు చేరుకుని షాక్ తిన్నాడు.

సాయిచరణ్ దుకాణంలో పనిచేస్తున్న గుమాస్తా విక్రమ్ సింగ్‌ అపస్మారక స్థితిలో గాయాలతో కనిపించాడు. అతడి కాళ్లు, చేతులు కట్టేయబడి వున్నాయి. దుకాణం సీసీటీవీ కెమెరాలు పగిలిపోయి దుకాణం ఎదుట డ్రైనేజీలో దర్శనమిస్తున్నాయి. దుకాణానికి వున్న అద్దం కూడా పగలిపోయివుంది. దీంతో షాక్ తిన్న మనోహర్ సింగ్ గుమాస్తా విషయాన్ని వెంటనే తన యజమాని మనోహర్ సింగ్ కు, ఆయన తన వ్యాపార భాగస్వామికి శ్యాంకు తెలియజేశారు. శ్యాం తోటి వ్యాపారి రాజాసింగ్‌, మనోహర్ సింగ్ లను తీసుకొని సంఘటనా స్థలానికి వచ్చారు.

గుమాస్తా విక్రంసింగ్ ను తీవ్రంగా గాయపర్చిన నలుగురు వ్యక్తులు 7కిలోల బంగారం, 7కిలోల వెండి, రూ.42లక్షల నగదును దోచుకువెళ్లినట్లు శ్యాం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పశ్చిమ ఏసీపీ సుధాకర్‌ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు దోపిడీ సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌‌ బి.శ్రీనివాసులు, డీసీపీ విక్రాంత్‌ పాటిల్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ విభాగం వారు సంఘటనా స్థలం నుంచి వేలిముద్రలు సేకరించారు. అదే సమయంలో నగరంలో కూడా అలర్ట్ ప్రకటించారు. అనుమానాస్పద కార్లను, బైక్ లను నిలిపేసి తనిఖీలు చేపట్టారు.

గంటల వ్యవధిలో చేధించిన పోలీసులు.. బంగారం రికవరీ..

 

కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే పోలీసులు పురోగతి సాధించారు. దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్న రాజస్థాన్ కు చెందిన విక్రమ్‌ సింగ్‌ గ్యాంగ్ ఈ దొంగతనానికి పాల్పడింది. సాయిచరణ్ బంగారు ఆభరణాల దుకాణంలో ఇటీవలే రెండు నెలల క్రితం పనిలో చేరిన విక్రమ్ ను అదుపులోకి తీసుకుని తమ స్టైల్ లో విచారించగా, నిజాలన్నీ బయటకు వచ్చేశాయి. బంగారాన్నంతా చోరి చేసి తాను పనిచేస్తున్న దుకాణం కింద నిర్మాణంలో వున్న మరో భవనంలో దాచిపెట్టి.. తన కాళ్లు, చేతులను తానే కట్టేసుకుని, తన చేతిపై బ్లేడుతో రక్తపు గాయం చేసుకుని అపస్మారక స్థితిలోకి జారుకున్నట్లు నటించాడు. వేలిముద్రులతో పాటు మరికొన్ని ఆధారాలు, సిసిటీవీ ఫూటేజీలను పరిశీలించిన పోలీసులు ఈ విషయాన్ని నిర్థారించుకుని విక్రమ్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles