ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలకు పైగా విస్తరించి.. అన్ని దేశాల్లోనూ విజృంభన కొనసాగిస్తున్న కరోనా మహమ్మారి తన ప్రభావాన్ని చాటుకుంటోంది. ఇప్పటికే ఏకంగా కోటి ఆరవై లక్షల మందికిపైగా తన ప్రభావానికి గురిచేసింది. ఇక ఏకంగా ఆరు లక్షలకు పైగా ప్రాణాలను కబళించివేసింది. ప్రపంచ వ్యాప్తంగానూ రోజురోజుకూ కేసులు సంఖ్య పెరుగుతూ అందోళనకర పరిస్థితులను ఉత్పన్నం చేస్తోంది. తజాగా రోజుకు ఏకంగా మూడు లక్షల కేసుల మేర నమోదు కావడం భాయాందోళన రేకెత్తిస్తోంది. శనివారం రోజున 24 గంటల వ్యవధిలో దాదాపు 2,84,196 కొత్త కేసులను నమోదు కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి ప్రమాద ఘంటికలను మ్రోగిస్తోంది.
ఇక మరణాల సంఖ్య కూడా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా ఆరు లక్షల మార్కు దాటింది. తాజాగా నమోదైన మరణాలతో 638,234 స్థాయికి చేరాయి, కరోనా వైరస్ ప్రభావం బారిన పడి అసువులు బాస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో ప్రపంచదేశాలన్నీ అందోళన చెందుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 15,668,380 కాగా, మరణాలు 638,243 కు పెరిగాయని యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్‌ఎస్‌ఇ) తన తాజా నివేదికలో వెల్లడించింది. సిఎస్‌ఎస్‌ఇ ప్రకారం, ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో అంటువ్యాధులు మరియు మరణాలు సంభవిస్తున్నాయి.
జెనీవాలో ఉన్న ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ నివేదిక ప్రకారం, అమెరికాలో కొవిడ్ బారిన పడి శుక్రవారం కొత్తగా 1000 మందికి పైగా మరణించారు. దీంతో అక్కడ మరణాల సంఖ్య 1,48,490కి చేరింది. కొత్తగా దాదాపు 80 వేల కేసులు నిర్ధారణ కావడంతో బాధితుల సంఖ్య 42,48,327కి పెరిగింది. ఇక వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న బ్రెజిల్‌లో కొత్తగా 55,891 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ బాధితుల సంఖ్య 23,43,366కు చేరింది. ఇక మహమ్మారి మరో 1,156 మందిని బలిగొనడంతో మరణాల సంఖ్య 85,238కు పెరిగింది.
ఇక తాజాగా నమోదైన కేసులతో దక్షిణ కొరియాలో కేసుల సంఖ్య మార్చి తర్వాత తొలిసారి భారీ సంఖ్యలో పెరిగాయి. శుక్రవారం కొత్తగా 113 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో అక్కడ కేసుల సంఖ్య 14,092కు చేరింది. కొత్త కేసుల్లో ఎక్కువ మంది ఇతర దేశాల నుంచి వచ్చినవారేనని అక్కడి ఆరోగ్యం శాఖ వెల్లడించింది. వైరస్‌ను సమర్థంగా కట్టడి చేసిన అతికొన్ని దేశాల్లో దక్షిణకొరియా ఒకటి. మెక్సికోలో 7,573 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. అలాగే మరో 737 మంది మరణించారు. దీంతో బాధితుల సంఖ్య 3,78,285కు, మృతుల సంఖ్య 42,645కు పెరిగింది.
కేసుల విషయానికొస్తే, భారతదేశం మూడవ స్థానంలో (1,288,108), ఆ తరువాత రష్యా (799,499), దక్షిణాఫ్రికా (421,996), మెక్సికో (378,285), పెరూ (375,961), చిలీ (341,304), యుకె (299,500), ఇరాన్ ( 286,523), స్పెయిన్ (272,421), పాకిస్తాన్ (270,400), సౌదీ అరేబియా (262,772), ఇటలీ (245,590), కొలంబియా (226,373), టర్కీ (224,252), బంగ్లాదేశ్ (218,658), ఫ్రాన్స్ (217,797), జర్మనీ (205,623) (153,520), కెనడా (115,115), ఖతార్ (108,638), ఇరాక్ (104,711), సిఎస్‌ఎస్‌ఇ గణాంకాలు చూపించాయి. 10,000 మందికి పైగా మరణించిన ఇతర దేశాలు యుకె (45,762), మెక్సికో (42,645), ఇటలీ (35,097), ఇండియా (30,601), ఫ్రాన్స్ (30,195), స్పెయిన్ (28,432), ఇరాన్ (15,289), పెరూ (17,843) మరియు రష్యా (13,026).
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more