Girl raped twice by father during lockdown కూతురిపై తండ్రి అత్యాచారం.. కన్నతల్లే మౌనసాక్ష్యం..

Girl raped twice by father during lockdown while mother stuffs cloth in her mouth

Rape, morena rape, madhya pradesh rape, mp rape, man rapes daughter, morena man rapes daughter, mp news, Madhya Pradesh, Crime

An 18-year-old girl from Morena district of Madhya Pradesh has accused her father of raping her twice during the lockdown. The girl claimed that she was raped twice by her father within 16 days and her mother was an accomplice.

కూతురిపై తండ్రి అత్యాచారం.. నోట్టో గుడ్డలు కుక్కిన తల్లే సాక్ష్యం..

Posted: 07/27/2020 08:27 PM IST
Girl raped twice by father during lockdown while mother stuffs cloth in her mouth

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. కనురెప్పే కంటిపాపను కాటేసింది. కామాంధుడైన భర్త తన కన్నబిడ్డను కాటేస్తున్నా.. మౌనసాక్షిగా నిష్చేష్టురాలై చూస్తున్న తల్లి కూడా.. తన భర్తకే సాయం చేయడం అంతకన్నా దారుణం. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మోరినా జిల్లాలో చోటుచేసుకుంది. తనపై తన కన్న తండ్రే రెండు పర్యాయాలు దారుణానికి ఒడిగట్టాడని 18 ఏళ్ల బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. యావత్ దేశం కరోనా మహమ్మారి కాటు వేస్తోందన్న అందోళనకు గురై జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న సమయంలో అదే లాక్ డౌన్ సమయాన్ని అదనుగా చేసుకుని తన తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది.

లాక్ డౌన్ సమయంలో పదహారు రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు తన తండ్రి మృగాడిలా తనపై పైశాచికత్వానికి తెగబడ్డాడని బాధితురాలు తెలిపింది. తన తండ్రి తనపై అత్యాచారం చేస్తుండగా తన తల్లి కూడా అతనికి సహకరించిందని తెలిపింది. తన అరుపులు బయటకు వినబడకుండా తన తల్లే తన నోట్లు గుడ్డలు పెట్టిందని, ఆ తరువాత తన తండ్రి దారుణానికి పాల్పడుతుండగా అమె అక్కడే మౌనసాక్షిగా నిలబడిందని ఆరోపించింది. మార్చి 26న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తాను వంటింట్లో పనిచేస్తుండగా, అకస్మాత్తుగా తన తండ్రి వచ్చి తన చేయి పట్టుకుని బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలు అరోపించింది.

ఆతరువాత తాను బయటకు వెళ్లనీయకుండా గదిలో పెట్టి తాళం వేశారని, దీంతో తాను పోలీసులకు కానీ లేదా ఇరుగుపోరుగు వారికి కానీ తన తండ్రి పైశాచికత్వంపై చెప్పేందుకు వీలు లేకుండా పోయిందని చెప్పింది. ఇక ఏప్రిల్ 10వ తేదీన తనకు అవకాశం లభించడంతో తాను ఇంట్లో నుంచి తమ అత్త ఇంటికి పారిపోయామని చెప్పింది. అయితే ఎలాగోలా తన అచూకీని తెలుసుకున్న తన తండ్రి.. అక్కడి నుంచి కూడా లాక్కుని వచ్చి.. ఆ రోజున కూడా రెండో పర్యాయం మరోమారు తనపై అత్యచారానికి పాల్పడ్డాడని తెలిపింది. అయితే తన పెద్దక్క 1098కి సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

అయితే పోలీసులు తన తండ్రి పైశాచికత్వానికి గుర్తులుగా తన ఒంటిపై, చెంపలపై, మణికట్టుపై వున్న రక్తపు గాయాలను చూపించింది. కాగా బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం తన కూతురు అరోపణలన్నీ భూటకమని కోట్టిపారేశారు. తమ బిడ్డ ఆరోపణలను వారు ఖండించారు. తమ ఇంటివద్దనున్న ఓ యువకుడి ప్రేమలో పడిందని.. అందుకు తాము అభ్యంతరాలను లేవనెత్తామని., దీంతో.. అమె యువకుడితో పారిపోకుండా తాము చర్యలు తీసుకున్నామని చెప్పారు. అయితే తప్పుడు అరోపణలతో తమను ఠాణా చుట్టు తప్పించి.. తమ బిడ్డ యువకుడితో పారిపోయేందుకు పథకం రచించి.. ఇలాంటి అరోపణలు మోపుతుందని అరోపిస్తున్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులపై తప్పక చర్యలు చేపడతామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles