ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని రాష్ట్రాలకు భిన్నంగా కరోనా మహమ్మారిపై పోరును సాగిస్తున్నారని ఈ క్రమంలో అమరావతి నుంచి అట్టహాసంగా వెయ్యికి పైగా అంబులెన్సులను ప్రారంభించి ప్రత్యర్థి పార్టీల ప్రశంసలు కూడా అందుకున్నారన్న అన్నారు. కానీ ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన అంబులెన్సు సేవలు నిజంగా రోగుల అవసరానికి ఉపయోగపడటం లేదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన సొంతూళ్లో కరోనా బాధితుడుని చెత్త వేసే మున్సిపాలిటీ బండిలో తీసుకెళ్లడంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన సొంత ఊర్లో ఈ ఘటన జరగడంతో సిగ్గుతో తల దించుకుంటున్నానని... ప్రజలు తనను క్షమించాలని అన్నారు.
అంబులెన్సులు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి మీడియా తీసుకెళ్లాలని విన్నవించారు. రాష్ట్రంలో కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తో చర్చించానని రఘురాజు చెప్పారు. కరోనా కేసుల్లో దేశంలోనే మూడో స్థానానికి ఏపీ చేరుకుందని... రానున్న రోజుల్లో అగ్రస్థానానికి చేరుకుంటుందని తెలిపారు. యాంటీ బాడీ టెస్టులు ఆలస్యమవుతున్నాయని... టెస్ట్ ఫలితాలు ఏడు రోజుల తర్వాత వస్తున్నాయని... ఈ లోపల వైరస్ విస్తరిస్తోందని చెప్పారు.
ఎంపీలు, అధికారులతో ముఖ్యమంత్రి వెబ్ సెమినార్ సమావేశం చేయాలని... ప్రతి రోజు మూడు జిల్లాల వారితో మాట్లాడాలని రఘురాజు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అతి పెద్ద సమస్య కరోనానే అని చెప్పారు. రాష్ట్రంలో చాలా మంది మాస్కులు లేకుండా తిరుగుతున్నారని... సాక్షాత్తు ఎంపీలు కూడా కరోనా బారిన పడ్డారని అన్నారు. రాష్ట్రంలో ఆయుర్వేదం చదివిన 8 వేల మంది డాక్టర్లు ఉన్నారని... వారి సేవలను కూడా వినియోగించుకోవాలని చెప్పారు. కరోనాతో సహజీవనం చేయాలనే వ్యాఖ్యలను పక్కన పెట్టి, దాన్ని అరికట్టడానికి యత్నించాలని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more