TTWREIS invites applications for 58 posts తెలంగాణ గురుకులంలో ఉపాధి అవకాశాలు

Ttwreis invites applications from eligible candidates for 58 posts

TTWREIS Recruitment 2020, Telangana Jobs, Government Jobs, Telangana Gurukul Jobs, Outsourcing jobs, Telangana out sourcing jobs, Telangana

Telangana Tribal Welfare Residential Educational Institutions Society TTWREIS invites applications for 58 posts apply before July 30 from the eligible candidates.

తెలంగాణ గురుకులంలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఉపాధి అవకాశాలు

Posted: 07/28/2020 04:51 PM IST
Ttwreis invites applications from eligible candidates for 58 posts

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పిందీ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకషనల్ ఇన్‌స్టిట్యూషన్స్-TTWREIS పలు పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో 2 రోజులే గడువుంది. నోటిఫికేషన్ వివరాలిలా వున్నాయి...  తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకషనల్ ఇన్‌స్టిట్యూషన్స్-TTWREIS హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నాన్ టీచింగ్ స్టాఫ్‌ను నియమించుకుంటోంది. మొత్తం 58 ఖాళీలు ఉన్నాయి. ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే.

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూలై 15న ప్రారంభమైంది. ఈ పోస్టలకు దరఖాస్తు చేయడానికి 2020 జూలై 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత వెబ్ సైట్ లో పోందుపర్చింది ప్రభుత్వం. http://www.tgtwgurukulam.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. మొత్తం 58 ఖాళీలు ఉండగా అందులో స్టాఫ్ నర్స్- 3, కేర్ టేకర్ (డిగ్రీ కాలేజ్)- 10, ల్యాబ్ అసిస్టెంట్ (డిగ్రీ కాలేజ్)- 14, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ (డిగ్రీ కాలేజ్)- 2, జూనియర్ అసిస్టెంట్ కమ్ డీఈఓ- 1, ల్యాబ్ అసిస్టెంట్ / ల్యాబ్ అటెండర్- 14, కిచెన్ హెల్పర్- 3, ఆఫీస్ సబార్డినేట్స్- 11 పోస్టులున్నాయి.   

వేతనాల వివరాలు చూస్తే స్టాఫ్ నర్స్- రూ.17,500, కేర్ టేకర్ (డిగ్రీ కాలేజ్)- రూ.15,000, ల్యాబ్ అసిస్టెంట్ (డిగ్రీ కాలేజ్)- రూ.15,000, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ (డిగ్రీ కాలేజ్)- రూ.20,000, జూనియర్ అసిస్టెంట్ కమ్ డీఈఓ- రూ.15,000, ల్యాబ్ అసిస్టెంట్ / ల్యాబ్ అటెండర్- రూ.15,000, కిచెన్ హెల్పర్- రూ.12,000, ఆఫీస్ సబార్డినేట్స్- రూ.12,000 వేతనం లభిస్తుంది. ఆసక్తి వున్న అశావహులు ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా వెంటనే ధరఖాస్తు చేసుకోవాలని గురుకులం అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles