Revolutionary writer Vangapandu passes away జనపద గళం మూగబోయింది.. వంగపండు ఇకలేరు..

Revolutionary balladeer vangapandu prasada rao passes away

AP reolutionary poet, Revolutionary writer, Vangapandu Prasada Rao, Vangapandu Prasada Rao dead, Vangapandu Prasada Rao passes away, Telugu film poet, Jattu Trustvoda nuvveelli, Telugu Desam Party, revolutionary balladeer, poet vangapadu prasada rao, Hindustan Shipyard, coronavirus, andhra university

Revolutionary writer and eminent singer Vangapandu Prasada Rao, 77 years old, died of ill health in his residence located at Pedabondapalli of Parvatipuram mandal, Vizianagaram district. Prasada Rao who has been associated with Jana Natya Mandali since 1972 enthralled audience with his thought provoking songs and speeches.

జనపద జానపదగళం మూగబోయింది.. వంగపండు ఇకలేరు..

Posted: 08/04/2020 04:38 PM IST
Revolutionary balladeer vangapandu prasada rao passes away

(Image source from: Eenadu.net)

ప్రజాగాయకుడు, విప్లవ రచయిత, జానపద కళాకారుడు, ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ఉత్తరాంధ్ర జనం పాట ఊపిరి వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. ఇవాళ తెల్లవారు జామున విజయనగరం జిల్లాలోని స్వస్థలమైన పార్వతీపురంలోని స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రజల్ని చైతన్యపరిచే విధంగా వందలాది పాటలు రాసిన వంగపండుకు ఉత్తరాంధ్ర గద్దర్ గా పేరు ఉంది. వంగపండు మృతితో ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఉత్తరాంధ్ర కళాభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల సాహీతి వేత్తలు కూడా ఆయన మరణం పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

వంగపండు 1943 జూన్ లో జగన్నాథం, చిన్నతల్లి దంపతులకు పార్వతీపురం పెందబొండపల్లిలో జన్మించారు. జగన్నాథం, చిన్నతల్లి దంపతులకు ఆరుగురు సంతానం. అందులో ముగ్గురు అక్కాచెళ్లెల్లు, ముగ్గురు అన్నాదమ్ములు. అన్నదమ్ములలో పెద్దవాడే వంగపండు. ఆయన ఎస్ఎస్ఎల్ సీ ఫెయిల్ కావడంతో.. బొబ్బిలో ఐటీఐ చేశారు. ఉద్యమంలో చేరిన ఏడాదికే ఆయనకు విశాఖ షిప్ యార్డులో ఫిట్టర్ మెన్ గా ఉద్యోగం వచ్చింది. ఆయినా కూడా ఆయన ఉద్యమమే ఎక్కువ అనుకొని ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వంగపండు 1972లో గద్దర్ తో కలిసి జన నాట్యమండలిని స్థాపించారు. ఆయన మూడు దశాబ్ధాలలో 300లకు పైగా పాటలు రాశారు. ఆయన రాసిన కొన్ని పాటలు పది బాషలలోకి అనువదించబడ్డాయి. యంత్రమెట్లా నడుస్తుందంటే అనే పాట ఇంగ్లీష్ లో కూడా అనువదించబడి.. అమెరికా, ఇంగ్లాండ్ లలో విడుదలయింది. వంగపండు సాహీతీ సేవలకు మెచ్చిన ప్రభుత్వం చంద్రునికో నూలుపోగు అన్న చందంగా 2017లో కళారత్న పురస్కారాన్ని అందించి సత్కరించింది. వంగపండు శ్వాస, నిశ్వాసలు జనపదన్నే నమ్మాయి.. జానపదమై నలిచాయి.

ప్రజాకవి వంగపండు ప్రసాదరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించిందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఉత్తరాంధ్ర ఉద్యమానికి వంగపండు అక్షర సేనాధిపతిగా పనిచేశారని గుర్తు చేశారు. తెలుగువారి సాహిత్య కళారంగాల చరిత్రలో మహాశిఖరంగా నిలిచిపోతారని కొనియాడారు. వంగపండు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వంగపండు మృతి పట్ల తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌ సంతాపం తెలిపారు. ‘‘వంగపండు తన సాహిత్యం ద్వారా తెలుగు ప్రజలను జాగృతం చేశారు. తన గొంతు, పదాలతో అశేష ప్రజానీకాన్ని ఉర్రూతలూగించారు. ప్రజా చైతన్యానికి వంగపండు ఎనలేని కృషి చేశారు. ఆయన సాహిత్యం అనేక భాషల్లోకి అనువదించడం తెలుగు జాతికే గర్వకారణం. వంగపండు మృతి తెలుగు జానపద సాహిత్య లోకానికి తీరని లోటు. చివరి శ్వాస వరకు గొంతెత్తి వదల జానపదాలకు గజ్జెకట్టారు. ఆయన మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles