(Image source from: India.timesofnews.com)
కరోనా మహమ్మారి విశ్వాన్నే వణికిస్తోది. ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిపై తన ప్రభావాన్ని చాటిన నేపథ్యంలో, అన్ని రకాల పరీక్షలు వాయిదా పడగా, గత విద్యాసంవత్సరంలో విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారిలో ఫైనలియర్ పరీక్షలు మాత్రం జరుగుతాయని ఇప్పటికే స్పష్టతను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే దీనిపై చివరి విద్యా సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా ఓ పిటీషన్ తయారు చేసి దానిని ప్రధాని మంత్రి నరేంద్రమోడీ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి అన్ని రాష్ట్రాల చివరి విద్యా సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తుండగా, ఇక మరికొంత మంది ఈ విషయంలో ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపును కూడా తట్టారు.
అయితే ఫైనల్ ఇయర్ విద్యార్థులు అటు ప్రధాని దృష్టికి ఇటు న్యాయస్థానంలో పోరాటానికి సిద్దమవుతున్న క్రమంలో.. యూజీసీ విద్యార్థులకు అల్టిమేటం జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పటికీ, చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షల నిర్వహణ తప్పనిసరి అని.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేసింది. అలా కాని పక్షంలో సదరు డిగ్రీలను గుర్తించబోమని కూడా హెచ్చరించింది. వివరాలు ఇలా ఉన్నాయి... డిగ్రీ, పీజీ చివరి సంవత్సర విద్యార్థులకు సెప్టెంబరు 30 లోగా పరీక్షలు నిర్వహించాలని యూజీసీ, విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. కాగా, కొవిడ్-19 నేపథ్యంలో చివరి సంవత్సరం పరీక్షలు కూడా రద్దు చేయాలని దిల్లీ, మహారాష్ట్ర విశ్వవిద్యాలయాలు నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు సుప్రీం వద్ద అఫిడవిట్‌ను దాఖలు చేశాయి.
అంతేకాకుండా, కమిషన్ ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు కేసులు నమోదయ్యాయి. ఈ అంశంపై విచారణను జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం చేపట్టింది. ఈ నేపథ్యంలో, పరీక్షలను రద్దు చేయటం విద్యార్థులకు మేలు చేయదని.. యూజీసీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సర్వోన్నత న్యాయస్థానానికి నేడు విన్నవించారు. కాగా, కమిషన్ నిర్ణయం రాజ్యాంగం, చట్టానికి అనుగుణంగా లేదని ఆయా విశ్వవిద్యాలయాలు వాదించాయి. ఈ అంశంపై ప్రత్యుత్తరమిచ్చేందుకు కమిషన్‌కు వ్యవధినివ్వాల్సిందిగా తుషార్ మెహతా కోర్టును కోరారు. ఇందుకు సమ్మతించిన సర్వోన్నత న్యాయస్థానం, కేసు విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more