రాజస్థాన్ లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన రసకందాయ పరిస్థితి క్రమంగా సద్దుమణుగుతోంది. ఇప్పటికే ఈ పరిస్థితులను ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో.. ఆయనకు అసమ్మతి వర్గం నుంచి ఓ నేత జైకోట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అయి కొన్ని డిమాండ్లు వారి ముందు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే వాటిపై ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు కూడా సానుకూలంగా ఉన్నారన్న సంకేతాలు కూడా వస్తున్నాయి.
తాజాగా సచిన్ పైలట్ మద్దతుదారుడైన ఎమ్మెల్యే భన్వర్లాల్ శర్మ సీఎం అశోక్ గహ్లోత్కు జై కోట్టాడు. అంతేకాదు ఏకంగా ముఖ్యమంత్రితో భేటీ అయిన ఆయన ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా అసమ్మతి వర్గంలో ఎంతమంది నేతలు వున్నారు.. వారు ఆలోచితా విధానం ఎలా వుంది.. ఎవరితో కలసి ముందుకు వెళ్లాలని యెచిస్తున్నారు అన్న విషయాలపై కూడా చర్చించారని సమాచారం. భన్వర్ లాల్ రాకతో మరికొంత మంది కూడా అసమ్మతి గూటి నుంచి అధికార గూటికి చేరే అవకాశాలు వున్నయని సమాచారం.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గహ్లోత్ నాయకత్వంలో పనిచేస్తామని అన్నారు. తమ నాయకుడు గహ్లోతేనని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్ నేతనేనని స్పష్టం చేశారు. ‘కుటుంబం అన్నాక చిన్నచిన్న గొడవలు ఉంటాయి. కుటుంబ పెద్దపై పిల్లలు అలకబూని కొద్ది రోజులు అన్నం తినకుండా మొండికేస్తారు. మేమూ అంతే. మా నాయకుడిపై అసహనంతో నెలపాటు దూరంగా ఉన్నాం. ఇప్పుడు అన్ని వివాదాలు సమసిపోయాయి. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను మా ప్రభుత్వం నెరవేర్చుతుంది’అని భన్వర్లాల్ ట్విటర్లో పేర్కొన్నారు. ఇక నిన్నటి వరకు ఉప్పు నిప్పులా సాగిన పైలట్, గహ్లోత్ మద్దతుదారుల మధ్య సంబంధాలు ఒక్కసారిగా మారిపోవడంతో అవాక్కయ్యామంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more