Looters descend on downtown Chicago షికాగోలో హింస.. మరోమారు చెలరేగిన అల్లరిమూకల లూటీలు..

Mass looting in chicago shots fired over 100 arrested

Chicago mass lootings, george floyd protests, Chicago Police, chicago river, Michael Pfleger, Looters, george floyd, Donald Trump, Chicago River, Catholic Church, US, America

Hundreds of looters and vandals descended on downtown Chicago early Monday following a police shooting on the city's South Side, smashing the windows of dozens of businesses and making off with merchandise, cash machines and anything else they could carry, police said.

ITEMVIDEOS: షికాగోలో హింస.. మరోమారు చెలరేగిన అల్లరిమూకల లూటీలు..

Posted: 08/11/2020 02:20 PM IST
Mass looting in chicago shots fired over 100 arrested

అమెరికాలోని షికాగో నగరంలో మరోసారి హింస చెలరేగింది. లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు ఓ నల్లజాతీయుడిపై కాల్పులు జరిపిన సోమవారం తెల్లవారుజామున వందల మంది యువకులు వీధుల్లోకి వచ్చి వీరంగం సృష్టించారు. వాణిజ్య సముదాయాల్లోకి చొరబడి లూటీకి  పాల్పడ్డారు. ఈ సందర్భంగా పరిస్థితిని అదుపు చేసేందుకు జరిగిన కాల్పుల్లో ఒక పౌరుడు, సెక్యూరిటీ గార్డుతోపాటు సుమారు 13 మంది అధికారులు గాయపడ్డారు. ఈ ఘటనపై  సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు హల్ చల్ చేశాయి.

మాగ్నిఫిసెంట్ మైల్ తోపాటు, ఇతర ప్రాంతాల్లో సాయుధులైన వందలమంది దుండగులు షాపులు, హోటళ్లలోకి చొరబడి, షాపుల కిటీకీలను ధ్వంసం చేశారు. గంటల తరబడి విధ్వంసానికి తెగబడి భయోత్పాతం సృష్టించారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా పలు ఆంక్షలను విధించారు. ఇది నేరపూరిత సంఘటన అని పోలీస్ సూపరింటెండెంట్ డేవిడ్ బ్రౌన్ తెలిపారు. పోలీసులు ఒక నిరాయుధ యువకుడిని కాల్చి చంపారంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించడంతో అల్లర్లు చెలరేగాయన్నారు.

అతను పోలీసులపై కాల్పులు జరపడంతో తాము తిరిగి కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నట్టు చెప్పారు. తాజా ఘటనలో 100 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఐదు తుపాకులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ ఘటనపై షికాగో మేయర్ లోరీ లైట్‌ఫుట్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. హింసను తీవ్రంగా ఖండించారు. నిందితులను తక్షణమే గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. మరోవైపు అరెస్టు చేసిన వారిని విడుదల  చేయాలంటూ కొంతమంది ఆందోళనకు దిగారు.

(Video Source:  WGN News)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chicago river  Michael Pfleger  Looters  george floyd  Donald Trump  Chicago River  Catholic Church  US  America  

Other Articles