అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో తొలిసారి భారత సంతతికి చెందిన మహిళకు అత్యున్నత గౌరవం దక్కింది. డెమెక్రాట్ పార్టీ నుంచి అమె అత్యున్నత స్థాయి పదవి బరిలో నిలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ లో జరిగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రట్ పార్ అభ్యర్థిగా బరిలో నిలవనున్న జో బిడెన్.. ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హారిస్‌ను ఎంపిక చేసుకున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపికైన తొలి నల్లజాతి వ్యక్తిగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు.
కమలా హారిస్ ప్రస్తుతం కాలిఫోర్నియా నుంచి డెమోక్రట్ పార్టీ సెనేటర్‌గా ఉన్నారు. జో బిడెన్‌కు ఎన్నికల వ్యూహకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు. కమలా హారిస్ ఎంపికను జో బిడెన్ ట్విటర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. తామిద్దరం కలిసి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించబోతున్నామన్నారు. అమెరికాను తిరిగి గాడిలో పెట్టేందుకు కమలా హారిస్ తనకు చక్కని భాగస్వామి అని అభివర్ణించారు. తన ఎంపికపై స్పందించిన కమలా హారిస్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. కమలా హారిస్ తల్లి భారతీయురాలు కాగా, తండ్రి ఆఫ్రికాలోని జమైకా దేశస్థుడు. తమిళనాడుకు చెందిన కమల తల్లి శ్యామలా గోపాలన్ 1960లో అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిర పడ్డారు.
I have the great honor to announce that I’ve picked @KamalaHarris — a fearless fighter for the little guy, and one of the country’s finest public servants — as my running mate.
— Joe Biden (@JoeBiden) August 11, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more