సమాజంపై కొవిడ్-19 తీవ్ర ప్రభావం చూపుతుండటంతో దేశంలో ఆన్లైన్ మందుల సరఫరాకు నానాటికి డిమాండ్ పెరుగుతోంది. వాణిజ్య దిగ్గజాలు అమెజాన్, రిలయన్స్ కూడా ఆన్లైన్ ఫార్మా రంగంలోకి అడుగుపెట్టడం ఇందుకు ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఔషధాల ఆన్లైన్ సరఫరా, నిబంధనల గురించి వివిధ సందేహాలు తలెత్తుతున్నాయి. కాగా, మారుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా, వారి ఇంటి వద్దకే ఔషధాల సరఫరా చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. అయితే ఈ విషయంలో నియంత్రణ ఉండటం అవసరం అని తెలిపింది. ఇందుకు సంబంధించిన నిబంధనలు ఇలా ఉన్నాయి...
* లైసెన్సు గల ఫార్మా సంస్థలు ఔషధాలను వినియోగదారుల ఇళ్లకు అందచేయవచ్చు.
* లైసెన్సు గల ఫార్మా సంస్థలు మాత్రమే షెడ్యూల్ హెచ్ వర్గానికి చెందిన మందులను అందించాలి.
* ఫార్మా అమ్మకందారులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ సేకరించిన తరువాతే అమ్మకాలు జరపాలి.
* ప్రిస్కిప్షన్లు స్వీకరణకు వినియోగించే ఇ మెయిల్ ఐడీని అధికారికంగా రిజిస్టర్ చేసుకోవాలి.
* అమ్మకందారులు తమ రెవెన్యూ పరిధికి చెందిన ప్రాంతాలకు మాత్రమే మందులను సరఫరా చేయాలి.
* దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యులు ప్రిస్క్రిప్షన్ తేదీ నుంచి 30 రోజుల మందులను మాత్రమే సరఫరా చేయాలి.
* ప్రమాదకర వ్యాధులకు ప్రిస్క్రిప్షన్ తేదీ నుంచి వారం రోజులకు మాత్రమే ఔషధాలు అందించాలి.
* ఆన్ లైన్ మందుల విక్రయాలకు సంబంధించిన బిల్లును రిజిస్టర్డ్ ఈ మెయిల్ ద్వారా వినియోగదారులకు పంపాల్సి ఉంటుంది.
* ఆన్ లైన్ ఔషధాలకు సంబంధించిన వివరాలను, బిల్లులను, రికార్డులను విక్రేతలు భద్రపరచాల్సి ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more