(Image source from: Zeenews.india.com)
అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్లు లేఖ రాయడం అది కాస్తా విపక్ష పార్టీలకు లీక్ కావడంపై ఇవాళ సీడబ్ల్యూసీ సమావేశంలో హాట్ టాఫిక్ గా మారిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సీరియస్ కావడం.. అందుకు పలువురు సీనియర్ నేతలు నోచ్చుకుంటూ ట్వీట్ లు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే సీనియర్ నేత కపిల్ సిబల్ మాత్రం ఆ తరువాత కాస్త వెనక్కు తగ్గారు. తాను పెట్టిన ట్వీట్ ను ఉపసంహరించుకున్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ తనకు వ్యక్తిగతంగా చెప్పారని... అందుకే తాను చేసిన ట్వీట్ ను తొలగిస్తున్నానని చెప్పారు.
సీడబ్ల్యూసీ సమావేశంలో 23 మంది సీనియర్లు లేఖ రాయడంపై రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు ఎలా బయటకు వెళ్తున్నాయని ప్రశ్నించారు. కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీ ఏజెంట్లంటూ రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరంతా బీజేపీతో కుమ్మక్కయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కపిల్ సిబాల్, గులాం నబీ ఆజాద్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు. మమ్మల్ని బీజేపీతో కుమ్మక్కయ్యామంటారా? అంటూ సిబాల్ ట్వీట్ చేశారు. రాజస్థాన్ హైకోర్టులో వాదించి ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఎవరని ప్రశ్నించారు. మణిపూర్ లో బీజేపీని దించి కాంగ్రెస్ ను కాపాడింది ఎవరని అడిగారు. గత 30 ఏళ్ల కాలంలో బీజేపీకి అనుకూలంగా ఒక్క ప్రకటన అయినా చేయడం చూశారా? అని అసహనం వ్యక్తం చేశారు.
రాహుల్ ఆరోపించినట్లు ఒకవేళ తాను బీజేపీ ఏజెంట్‌నే అయితే, తాను వెంటనే రాజీనామా చేసేసి బయటికి వెళ్లిపోతానని ఆజాద్ అన్నారు. సీడబ్ల్యూసీ సభ్యుల వ్యవహార శైలి బాగోలేకపోవడంతోనే తాము లేఖ రాశామని చెప్పారు. తాము బీజేపీతో కుమ్మక్కయ్యామని అనడం ఏంటంటూ కపిల్ సిబాల్ కూడా ట్విట్టర్ లో రాహుల్ గాంధీని ప్రశ్నించారు. రాజస్థాన్ హైకోర్టులో విజయవంతంగా వాదించి కాంగ్రెస్‌ను కాపాడామని, మణిపూర్ లో బీజేపీని దించి కాంగ్రెస్‌ను రక్షించామని, తాను 30 ఏళ్లలో బీజేపీకి అనుకూలంగా ఒక్క ప్రకటనైనా చేయడం చూశారా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలను కొనసాగించలేనని సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియాగాంధీ స్పష్టం చేయడంపై పార్టీ సీనియర్లైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ స్పందించారు. సీడబ్ల్యూసీ సమావేశంలో మన్మోహన్ మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షురాలిగా సోనియా కొనసాగాలని ఆయన విన్నవించారు. సోనియాకు కొందరు సీనియర్లు లేఖ రాయడం దురదృష్టకరమని అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ని బలహీనపరచడమంటే పార్టీని బలహీనపరచడమేనని చెప్పారు. మన్మోహన్ సింగ్ తర్వాత ఏకే ఆంటోనీ మాట్లాడుతూ, లేఖలో ఉపయోగించిన పదాలు దారుణంగా ఉన్నాయని అన్నారు. ఇదే సమయంలో పార్టీకి సోనియాగాంధీ చేసిన సేవల గురించి చెప్పారు. సోనియాకు ఇష్టం లేని పక్షంలో పార్టీ పగ్గాలను రాహుల్ గాంధీ స్వీకరించాలని కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more