సినీ నటుడు, తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన నాయుడు మళ్లీ వార్తల్లో నిలిచాడు. బిగ్ బాస్-2 షోలో గాయాలపాలై షో నుంచి వెళ్లిపోయి మళ్లీ వచ్చినా మళ్లీ గాయంతో వైదొలగిన నూతన్ నాయుడు అప్పట్లో వార్తల్లో వ్యక్తిగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోమారు ఆయన దారుణమైన అరోపణలు ఎదుర్కోంటూ వార్తల్లో వ్యక్తిగా మారారు. నూతన్ నాయుడు తన వద్ద పనిచేసిన దళిత యువకుడిపై తన మనుషులతో బలవంతంగా శిరోముండనం(గుండు గీయించడం) చేయించారని ఆరోపణలు సంచలనం సృష్టించాయి.
దళితుడన్న కనికరం కూడా లేకుండా తనపై దారుణానికి ఒడిగట్టాడని బాధితుడు అరోపిస్తున్నాడు. తాను పనిచేసే ఇంటి యాజమాని అయిన నూతన నాయుడు.. తన మనషుల చేత బలవంతంగా తనకు గుండు గీయించాడని దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులకు ఆయన పిర్యాదు చేశారు. కాగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి సుజాతనగర్లో నూతన నాయుడు నివాసముంటున్నారు. నూతన నాయుడు ఇంట్లో దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ పని చేస్తున్నారు. కాగా కరోనా వేళ.. తన తల్లిదండ్రుల చెంతకు వెళ్తానని చెప్పి ఆగస్టు ఒకటో తేదీ వచ్చేశాడు.
అయితే తల్లిదండ్రుల ఒత్తడి మేరకు కరోనా కష్టకాలం నేపథ్యంలో మళ్లీ పనికి వెళ్లకుండా ఇంటిపట్టునే వుంటున్నాడు. దీంతో తనకు చెప్పకుండా పనిమానేయడంతో నూతన నాయుడుకు కోపం వచ్చిందని. దీంతో తనపై సెల్ ఫోన్ పోయిందన్న దొంగతనం ఆరోపణలు మోపాడని శ్రీకాంత్ తెలిపాడని పోలీసులు చెప్పారు. నూతన్ నాయుడు నుంచి ఇలా ఫోన్ రావడంతో తన నిజాయితీని నిరూపించుకునేందుకు వెళ్లిన శ్రీకాంతన్ ను తన మనుషులతో బంధించి గుండు గీయించినట్లుగా బాధితుడు అరోపిస్తున్నాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నూతన నాయుడు బెదిరించినట్లు శ్రీకాంత్ తెలిపారు. శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు సంఘటనపై పెందుర్తి పోలీసులు విచారణ చేపట్టారు.
It’s alleged that celebrity Nutan Naidu got this Youth belonging to scheduled caste tonsured and he alleges that Nutan Naidu has threatened him plz @APPOLICE100 look into it pic.twitter.com/DD4rkRHyOr
— Lokesh journo (@Lokeshpaila) August 28, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more