కరోనా వైరస్ ప్రభావం ఏయే రాష్ట్రాల్లో ఎంతగా వుందన్న విషయాలను తెలుసుకునే పనిలో భాగంగా పలు సంస్థలు సర్వేలకు మొగ్గుచూపుతున్నాయి, ఇటీవల సీసీఎంబి నిర్వహించిన సర్వే ప్రకారం హైదరాబాద్ మహానగరంలో ఆరు లక్షల అరవై వేల మందిపై కంటికి కనిపించని శత్రువు దాడి చేశాడని, అయితే నగరవాసుల్లో దాదాపుగా దాడి చేసిన వారందరూ శత్రువుతో తెలియకుండానే బాగా పోరాడారని దీంతో శత్రువు ఓటమిని చవి చూశాడని కూడా సర్వే నివేదికలు వెల్లడించాయి. కాగా ఒక్కటి నుంచి రెండు శాతం మాత్రం దీని ప్రభావానికి గురై అసుపత్రుల పాలయ్యారని తెలిపాయి. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ ఓ సర్వే సంస్థ నిర్వహించిన సర్వోలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
సీరో సంస్థ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు 5 కోట్ల మంది జనాభాలో ఇప్పటికే కోటి మందిపైగా ( దాదాపుగా రాష్ట్ర జనాభాలో 19.7 శాతం మందికి) కరోనా వైరస్ సోకిందని.. కంటికి కనిపించని శత్రువు ఎలా వచ్చిందో అలానే వెళ్లిపోయినట్టు తేలింది. వైరస్ వ్యాప్తి తీవ్రతను గుర్తించేందుకు ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సీరో సర్వే నిర్వహించింది. తొలి దశలో అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో సర్వే నిర్వహించింది. రక్తంలోని సీరంలో ఉన్న యాంటీబాడీల ఆధారంగా కరోనా సోకిందీ, లేనిదీ నిర్ధారించవచ్చు. ఈ సందర్భంగా ఈ నాలుగు జిల్లాలో నిర్వహించిన సర్వేలో 15.7 శాతం మందికి కరోనా సోకి వెళ్లిపోయినట్టు తేలింది.
మిగిలిన తొమ్మిది జిల్లాలలో రెండో దశలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో వెల్లడైన విషయాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ నిన్న వెల్లడించారు. రెండో దశ సర్వేలో భాగంగా ఒక్కో జిల్లా నుంచి 5 వేల మంది చొప్పున 9 జిల్లాల నుంచి మొత్తం 45 వేల నమూనాలు సేకరించారు. వారిలో 19.7 శాతం మందికి వారికి తెలియకుండానే వైరస్ సోకి వెళ్లిపోయినట్టు నిర్ధారణ అయింది. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 30.6 శాతం మందిలో, కర్నూలు జిల్లాలో 28.1 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 21.5 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు.
చిత్తూరు జిల్లాలో 20.8 శాతం, విశాఖపట్నంలో 20.7 శాతం, కడపలో 19.3 శాతం, గుంటూరు జిల్లాలో 18.2 శాతం, ప్రకాశం జిల్లాలో 17.6 శాతం మందిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందాయి. అతి తక్కువగా పశ్చిమగోదావరి జిల్లాలో 12.3 శాతం మందిలో యాంటీబాడీలు కనిపించాయి. తెలియకుండానే వైరస్ సోకిన వారిలో 19.5 శాతం మంది పురుషులు కాగా, 19.9 శాతం మంది మహిళలు ఉన్నారు. వైరస్ వ్యాప్తి ఏయే జిల్లాల్లో ఎలా ఉందో తెలుసుకునేందుకే సర్వే నిర్వహించినట్టు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. భవిష్యత్ కార్యాచరణకు ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more