కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలపై నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు తొలగిపోయింది. చివరి ఏడాది సెమిస్టర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు గతంలో అనుసరించిన విధంగానే ఈ సారి కూడా పరీక్షలను రాయాల్సి వుంటుందని రాష్ట్రోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. దీంతో చివరి ఏడాది పరీక్షలు రాసే విద్యార్థులు తమ పరీక్షలు అన్ లైన్ లో జరుగుతాయా.? లేక పరీక్షా కేంద్రాలకు హాజరై పాత పద్దతిలోనే పరీక్షలకు హాజరుకావాలన్న అన్న మిమాంస ఎట్టకేలకు తొలగిపోయింది.
ఫైనల్ ఇయర్ విద్యార్థులు చివరి సెమిస్టర్ పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని.. అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. చివరి పరీక్షకు ఎప్పటిలాగే రాతపరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి వివరణ ఇచ్చింది. అటానమస్ కళాశాలలు వారికి అనుకూలమైన విధానంలో పరీక్షలు జరుపుకోవచ్చని సూచించింది. అయితే ఈ కేసును నిన్న కూడా విచారించిన న్యాయస్థానానికి ప్రభుత్వం తరపున అటర్నీ జనరల్ కరోనా నేపథ్యంలో పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులు సప్లిమెంటరీలో పరీక్షలను రాసుకోవచ్చేనని చెప్పారు. అందుకుగాను వారు సప్లమెంటరీలో ఉత్తీర్ణులైనా.. రెగ్యులర్ గా పాసైనట్టు పరిగణిస్తామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
అయితే, సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు ఉంటాయో స్పష్టత ఇస్తే.. విద్యార్థులు దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారని ఎన్ఎస్యూఐ తరఫు న్యాయవాది దామోదర్ రెడ్డి కోరగా.. పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనేది ఆయా శాఖలు నిర్ణయిస్తాయని, దానిపై ఇప్పుడే హామీ ఇవ్వలేమని అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ తెలిపారు. దీనిపై వివరణ ఇచ్చిన జేఎన్టీయూహెచ్.. రెండు నెలల్లోపు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పరీక్షలను కరోనా జాగ్రత్తలో నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం పిటిషన్లపై విచారణ ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. దీంతో పరీక్షల నిర్వహణకు విశ్వవిద్యాలయాలు సిద్ధమవుతున్నాయి. రేపటి నుంచి జేఎన్టీయూహెచ్.. ఎల్లుండి నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more