ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విమానాలపై దుబాయ్ ప్రభుత్వం నిషేధం విధించింది. దుబాయ్ లోని ఏ విమానాశ్రయంలోనూ ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు కొనసాగించరాదని అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. తాజాగా తాము ఎయిర్ ఇండియా సర్వీసులపై విధించిన నిషేధం అక్టోబర్ 2 వరకు అనగా పక్షం రోజుల వరకు కొనసాగనున్నాయని అక్కడి ప్రభుత్వ అధికారులు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. భారత్ తో సత్సంబంధాలు కలిగిన దుబాయ్ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడానికి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలు చేసిన తప్పిందమే కారణమని ప్రకటించింది.
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం.. విమానయాన నిబంధనలను ఉల్లంఘించి కరోనా పాజిటివ్ సర్టిఫికెట్ కలిగిన ప్రయాణికులను తీసుకువచ్చిందని తెలిపింది. నిబంధనలు మీరి ఇలా కరోనా రోగిని తీసుకువచ్చినందుకు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎయిర్ ఇండియా సర్వీసులను అక్టోబర్ 2 వరకు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. యూఏఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం, భారత్ నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడు 96 గంటల ముందే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని, అందులో నెగిటివ్ నిర్ధారణ కావాలని, ఆ సర్టిఫికెట్ ఉంటేనే దుబాయ్‌కి వెళ్లడానికి వీలుంటుందన్నారు.
అయితే ఈనెల 4న జైపూర్ నుంచి దుబాయ్ కు వెళ్లిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో ఓ వ్యక్తి కరోనా పాజిటివ్ సర్టిఫికెట్ తో ప్రయాణించాడని పేర్కోంది, సదరు ప్రయాణికుడి వద్ద సెప్టెంబర్ 2 తేదీతో కోవిడ్-పాజిటివ్ సర్టిఫికెట్ ఉందని చెప్పారు. అయితే ఇది పొరబాటుగా జరిగిన ఘటన కాదని, గతంలోనూ ఇలాంటి తప్పిదానికే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం పాల్పడిందని వెల్లడించారు. దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలను సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2 వరకు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నిలిపివేసినట్లు తెలిపారు.
ఇక దీనికి తోడు విమాన సిబ్బందితో పాటు ఆ విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు ఎవరైనా కరోనా బారిన పడితే వారి వైద్య చికిత్స, క్వారంటైన్ కు సంబంధించిన మొత్తాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమాన సంస్థ భరించాలని కూడా దుబాయ్ పౌర విమానయాన శాఖ నోటీసులో పేర్కోంది, ఇక దీనికి తోడు ఇకపై ఇలాంటి తప్పిదాలు జరగకుండా కోచ్చి కేంద్రంగా నడిచే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఎలాంటి చర్యలు చేపడుతోందన్న కరెక్టివ్ యాక్షన్ ప్లాన్ సమర్పించాలని కోరింది, కాగా, ఈ పరిణమాలపై స్పందించిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ అధికార నిషేధం వున్న పక్షం రోజులు తమ దుబాయ్ విమానాలను షార్జాకు మళ్లిస్తామని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more