(Image source from: Indiatoday.in)
యావత్ ప్రపంచం కరోనా మహమ్మారిని ఎదుర్కోని సంకట పరిస్థితుల్లోకి నెట్టివేయబడగా, క్రమేపి దానిని అధిగమించి పయనించేందుకు అన్ని దేశాలు ముందుకు సాగుతున్న నేపథ్యంలో దేశంలోని ఉగ్రవాదులు మాత్రం తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. యావత్ దేశం కరోనా కల్లోలంలో చిక్కకున్నా.. వీరు మాత్రం దేశంలో ఉగ్రదాడులు చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. దీంతో పక్కా సమాచారం అందుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో 9 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదులు పట్టుబడ్డారు. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు మొత్తంగా తొమ్మిది మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.
పశ్చిమ బంగాల్ లోని ముర్షీదాబాద్ లో ఆరుగురిని, కేరళలోని ఎర్నాకుళంలో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ. దేశంలోని ప్రముఖ నగరాలలో వీరు విధ్వంసం సృష్టించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని, దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఉగ్రవాద దాడులకు వ్యాప్తంగా జనసమ్మర్థ ప్రదేశాల్లో బాంబు దాడులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలు తీసేందుకు కుట్ర చేస్తున్నట్లు ఎన్ఐఏ ఆరోపించింది. తొమ్మిది మంది ఉగ్రవాదుల నుంచి పలు డాక్యూమెంట్లు, డిజిటల్ డివైస్ లను, జీహాదీ సాహిత్యాన్ని, నాటు తుపాకులు, శరీర కవచాలు, నాటు పేలుడు పదార్థాలు తయారు చేయడానికి అవసరమైన పరిజ్ఞానంతో కూడిన మెటీరియల్, పదునైన ఆయుధాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.
వీరంతా పాకిస్థాన్ కేంద్రంగా పని చేసే అల్ ఖైదా అనుబంధ సభ్యులని ఎన్ఐఏ వెల్లడించింది. సామాజిక మాధ్యమాల ద్వారా అల్ ఖైదాలో చేరి ఢిల్లీ సహా, దేశవ్యాప్తంగా దాడులకు కుట్ర చేసినట్లు పేర్కొంది. నిధుల సేకరణకు పాల్పడటం సహా, వీరిలో కొందరు ఢిల్లీ వెళ్లి ఆయుధాలు కొనుగోలు చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు వివరించింది. అల్ ఖైదాకు చెందిన అంతర్రాష్ట్ర ఉగ్రముఠా పశ్చిమబెంగాల్, కేరళలోని వివిధ దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసాలకు పేలుళ్లకు పాల్పడేందుకు కుట్ర పన్నుతున్నట్లు తెలిసిందని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అరెస్టైన వారిలో కేరళకు చెందిన ముర్షీద్ హసన్, యాకుబ్ బిస్వాస్, ముషారప్ హుస్సేన్, పశ్చిమ బెంగాల్ కు చెందిన షకీబ్, అబు సోఫియాన్, మెయినల్ మోండల్, యీన్ అహ్మద్, మనుమ్ కమల్, రెహ్మాన్‌లను ముషీరాబాద్‌లో అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరిని సంబంధిత కోర్టుల్లో హాజరుపరుస్తామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more