TSRTC resumes bus services in city limits నగరంలోనూ పునఃప్రారంభం కానున్న బస్సు సర్వీసులు

Tsrtc resumes city bus services in urban limits of ghmc from tomorrow

Hyderabad, tsrtc bus services, Hyderabad, city services, TSRTC, Telangana State Road Transport Corporation, Hyderabad unlock, Greater Hyderabad, coronavirus in hyderabad, TSRTC Buses, City Services, Suburban bus services, Outer Hyderabad, TSRTC, Lockdown, GHMC, Coronavirus, covid-19

After TSRTC resumed suburban and mofussil bus services in the Hyderabad outskirts on Wednesday, The Officials today took a decision on city bus services. The RTC buses to resume services in city limits from Friday.

హైదరాబాద్ నగర ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సిటీ బస్సు సర్వీసులు షురూ.!

Posted: 09/24/2020 09:16 PM IST
Tsrtc resumes city bus services in urban limits of ghmc from tomorrow

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మార్చి మాసంలో విధించిన లాక్ డౌన్ కారణంగా డిపోలకు మాత్రమే పరిమితమైన ఆర్టీసీ బస్సులు అంతజిల్లాల సర్వీసులు అన్ లాక్ 2.0 నుంచి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దాదాపు ఆరునెలలుగా బస్సులు లేకపోయినా నగరజీవి తప్పనిసరి పరిస్థితుల్లో ఇతరాత్ర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాడే తప్ప.. బస్సుల కోసం మాత్రం వేచిచూడలేదు. ఇక అన్ లాక్ ప్రారంభం జూన్ నుంచి అమల్లోకి వచ్చానా.. హైదరాబాద్ లో శరవేగంగా విస్తరిస్తూ నగరవాసులను భయకంపితులను చేసిన కరోనా దెబ్బకు ప్రభుత్వం కూడా ఆచితూచి నిర్ణయాలను తీసుకుంది,

నగరంలో బస్సు సర్వీసులను మాత్రం అప్పుడే ప్రారంభిస్తే కరోనా వ్యాప్తి మరింత వేగంగా పెరుగుతుందని యోచించిన ప్రభుత్వం.. ఆర్టీసీ ఉన్నతాధికారులు సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చినా ప్రభుత్వం మాత్రం అచితూచి అడుగులు వేసింది. నగరంలో క్యాబ్ సర్వీసులను కూడా ఆన్ లాక్ 2.0 నుంచే అనుమతిని ఇచ్చిన తెలంగాణ సర్కార్.. ప్రజా రవాణాను మాత్రం ప్రారంభించడంలో సాధ్యసాధ్యాలను పరిశీలించిందే తప్ప నగరంలో బస్సుల సంచారానికి అనుమతిని ఇవ్వలేదు. అన్ లాక్ 4.0తో దేశవ్యాప్తంగా మెట్రో రైళ్ల సేవలు అందుబాటులోకి రావడంతో ఇక తాజాగా నిన్నటి నుంచి నగరశివారు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఇక తాజాగా నగరంలో బస్సు సర్వీసులను ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకువస్తుందో తెలియకపోవడంతో ఎదురుచూసిన నగర ప్రయాణికులకు ఆర్టీసీ ఉన్నతాధికారులు తాజాగా శుభవార్తను అందించారు. రేపటి నుంచి హైదరాబాద్ సిటీ బస్సులు అన్ని ప్రారంభం కాబోతున్నయని తెలిపారు. దాదాపు 185 రోజుల తర్వాత నిన్న పాక్షికంగా సిటీ బస్సులు రోడ్డు మీదకు వచ్చాయి. అయితే నగర శివార్లలోని డిపోల నుంచి 229 బస్సులను అధికారులు తిప్పారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 3,200 బస్సులు ఉన్నాయి. రేపటి నుంచి పూర్తి స్థాయిలో బస్సులు రోడ్డెక్కనున్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 29 డిపోలు ఉన్నాయి. వీటిలో శివార్లలో ఉన్న డిపోల నుంచి 15 కిలోమీటర్ల రేంజ్ లో నిన్న బస్సులు తిరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC Buses  City Services  Suburban bus services  Outer Hyderabad  TSRTC  Lockdown  GHMC  Coronavirus  covid-19  

Other Articles