China Cat que virus to cause disease in India చైనా నుంచి పొంచి వున్న మరో ముప్పు 'క్యాట్ క్యు వైరస్'

Cat que virus from china has potential to cause disease in india icmr

SARS CoV-2, ICMR, arthropod-borne viruse, Cat Que virus, CQV, NIV, Culex mosquitoes, Kyasanur forest disease, Dengue, Chikungunya viruses, Indian Journal of Medical Research

Even as India grapples with the SARS CoV-2 virus causing covid-19, scientists at the Indian Council of Medical Research (ICMR) have found another virus -- cat que virus -- largely reported in China and having the potential to cause disease in the country.

చైనా నుంచి పొంచి వున్న మరో ముప్పు ‘‘క్యాట్ క్యు వైరస్’’

Posted: 09/29/2020 10:55 PM IST
Cat que virus from china has potential to cause disease in india icmr

(Image source from: Loksatta.com)

ప్రపంచవ్యాప్తంగా జనజీవనాన్ని స్థంభింపచేసి.. ఆర్ధిక పురోగతిని మందగమనంగా మార్చిన కరోనా మహమ్మారి చైనా దేశపు పుడమి కుట్రేనని ఇప్పటికే అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారు. దీనికి బలం చేకూర్చేలా చైనా దేశపు విజిల్ బ్లోయర్స్ కూడా దీనిని సమర్థిస్తున్నారు. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా తెలుసునని కూడా వారు వాదించడం కొసమెరుపు. అయినా డబ్యూహెచ్ఓ మాత్రం ఇంకా చైనా బజన చేస్తుండటాన్ని పలు దేశాలు అక్షేపిస్తున్నాయి. చైనా ల్యాబ్ లో పురుడుపోసుకుందన్న అభియోగాల నేపథ్యంలో కరోనా మహమ్మారి ఎలా పుట్టిందన్న విషయంలో అసలేం జరిగిందన్న విషయాలు ఆలస్యంగానైనా వెలుగులోకి వస్తాయని భావిస్తున్న శాస్త్రవేత్తలు.. ముందుగా ప్రజలను పరిరక్షించేందుకు వాక్సీన్ ను కనుగోనే పనిలో నిమగ్నమయ్యారు.

ఇదిలా వుండగానే భారత భూభాగంపై కన్నేసిన చైనా అరుణాచల్ ప్రదేశ్ డోక్లాంలో యుద్దమేఘాలను కమ్మెలా చేసింది. భారత భద్రతా బలగాలపై దొంగదెబ్బ తీసి.. పైకి మాత్రం నీతిసూక్తులు చెబుతోంది. ఇక ఇదే సమయంలో మన దేశంపై మరో వైరస్ తో విరుచుకుపడేందుకు సిద్దమయ్యింది. కరోనా మహమ్మారి నుంచి దేశంలోని ప్రజలు వేగంగా రికవరీ చెందుతున్నారని భావించిందో ఏమో తెలియదు కానీ.. భారత్ లో పెద్ద సంఖ్యలో వున్న యువతపై యుద్దన్ని ప్రకటించింది. ముఖ్యంగా భారతీయులు తినే వంటకాల్లో ఎక్కువ ఇమ్యూనిటీ వుందని తెలుసుకున్న చైనా.. భారతీయ యువతపై మరో వైరస్ అస్త్రాన్ని సందించేందుకు సిద్దమైంది.

ఈ విషయమై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) దేశప్రజలను హెచ్చరించింది. చైనా భారత్ పై ప్రయోగించే మరో వైరస్ పేరు ‘క్యాట్ క్యూ వైరస్’ (సీక్యూవీ) అని తెలిపింది. ఇప్పటికే ఈ వైరస్ రెడీగా వుందని, దానితో దాడికి సిద్ధంగా ఉందని పేర్కొంది. ఈ వైరస్ ను క్యూలెక్స్ జాతి దోమలు, పందులు క్యారియర్స్ గా మారుతాయని చెప్పింది. ఈ మేరకు చైనా, తైవాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఇప్పటికే వెల్లడైందని కూడా తెలిపింది. భారత్ లోనూ పందుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది. ఏజిప్టీతోపాటు క్యూలెక్స్ జాతి దోమల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది.

దేశవ్యాప్తంగా 883 సీరం నమూనాలను సేకరించి వాటిని పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)లో పరీక్షించారు. ఈ సందర్భంగా రెండు నమూనాల్లో క్యాట్ క్యూ వైరస్‌ను తిప్పికొట్టే ఐజీజీ యాంటీబాడీల జాడను గుర్తించారు. ఈ వైరస్ ప్రస్తుతం ఎంతమందిలో ఉన్నదీ తెలియాలంటే మరిన్ని నమూనాలను పరీక్షించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వైరస్ వల్ల మలేరియా, డెంగ్యూ వంటి ఫెబ్రైల్ ఆరోగ్య సమస్యలు ప్రబలే అవకాశం ఉందని పేర్కొన్నారు. మనుషులతోపాటు పందులు, ఇతర జంతువుల నుంచి కూడా శాంపిళ్లను సేకరిస్తామని తెలిపారు. ఇన్నాళ్లు పందుల నుంచి మెదడు వాపు వ్యాధి మాత్రమే సంక్రమించేది.. కాగా ఇప్పుడు తాజాగా ఫెబ్రైల్ వ్యాధులు కూడా సంక్రమించనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles