యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ మహమ్మారి.. గురించి నెలలు గడుస్తున్న కోద్దీ తాజా విషయాలు బయటకు వస్తున్నాయి, కరోనా మహమ్మారి అందరినీ తన వాహకాలు (క్యారియర్లు)గా చేసుకోదని తాజాగా అధ్యయాల్లో తేలింది. అయితే వ్యాధి గురించి ముందుగా తెలియని క్రమంలో భయంతోనే అనేక మంది అసువులు బాసారని సోషల్ మీడియా పోస్టులు ఇప్పటికే వైరల్ గా మారాయి. కరోనా బారిన పడి మరణించిన వారిలో దీర్ఘకాలిక శ్వాసకోశ, హృదయ, మధుమేహం సంబంధ వ్యాధిగ్రస్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపిందన్న విషయం తెలిసిందే. ఇక దాదాపుగా ఏలాంటి వ్యాధుల బారిన పడినవారు కూడా వైరస్ ప్రభావానికి గురై చికిత్సలతో అరోగ్యవంతులుగా బయటపడుతున్నారు.
ఏ దేశంలోనూ లేని విధంగా భారత్ లో రికవరీ రేటు అధికంగా వుందన్న విషయం కూడా తెలిసిందే. అదే సమయంలో కరోనా భయంకరమైన అంటు వ్యాధని, ఏకంగా ఆరు మీటర్ల దూరం వున్నా దాని బారిన పడిన రోగుల నుంచి అది ఇతరులకు సోకంతుందని అధ్యయనాలు వెల్డించిన తరుణంలో ఇటు మన దేశంలో మాత్రం అది అంత ప్రభావం చూపడం లేదని స్పష్టం అవుతోంది, ఇక ఇది అంటువ్యాధే అయినా.. దాని ప్రభావం కూడా కొంత మేరకే అని తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. ఇంట్లో ఓ కుటుంబ సభ్యుడికి కరోనా సోకినా.. లక్షణాలు బయటపడి ఆయన టెస్టు చేయించుకున్న తరువాత పాజిటివ్ అని తేలిన సందర్భంలోనూ ఆ ఇంటిలోని మిగతా సభ్యులు కరోనా బారిన పడటం లేదు. దీంతో కరోనా అంటువ్యాధి ఎలా అవుతోందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే పరిస్థితి అంతటా కనిపిస్తోంది. కరోనా వైరస్ ప్రభావం బారిన వారిలో 70 శాతం మంది నుంచి ఇది ఎవరికీ సంక్రమించలేదని, అసలు వారి నుంచి ఇతరులకు వ్యాధి సోకలేదని అధ్యయనంలో తేలింది. అయితే కొంతమందిని మాత్రమే వాహకాలుగా చేసుకున్న ఈ వైరస్.. వారి నుంచే ఇతరలకు వ్యాప్తి తాజా అధ్యయనంలో స్పష్టమైంది. కరోనా వైరస్ వ్యాప్తిపై దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించిన ఈ సంస్థ తమిళనాడు, అంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కాంటాక్టు కేసుల వివరాలను అధ్యయనం చేసిన తరువాత ఈ వివరాలను వెల్లడించింది. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ సంస్థ డైరెక్టర్ రమణన్ లక్ష్మీనారాయణన్ నేతృత్వంలోని రీసెర్చర్ల బృందం.. ఏపీ, తమిళనాడుల్లో 4.35 లక్షలకు పైగా కేసులతో పాటు వారితో కాంటాక్టులో వున్న వారి సుమారు 30 లక్షల మందిని పరిశీలించిన తరువాత ఈ మేరకు వివరాలను వెల్లడించారు, కోవిడ్ కేసులతో కాంటాక్టు అయినవారిలో అత్యధికులకు వైరస్ సోకలేదని నిర్ధారించారు. ఇండియాలో వినూత్న మార్గాల్లో వైరస్ వ్యాపిస్తోందని తెలిపారు.
కేవలం తమిళనాడు, అంద్రప్రదేశ్ రాష్ట్రాల డాటాను మాత్రమే అధ్యయనం చేసిన ఈ సంస్థ మిగతా రాష్ట్రాల్లో పరిస్థితిపై మాత్రం పూర్తి గణాంకాలను పొందుపర్చలేదు, మొత్తంగా 84,965 మంది కరోనా రోగులతో పాటు వారితో కాంటాక్ట్ అయిన 5.75 లక్షల మందికి పైగా ప్రజల ల్యాబ్ రిజల్ట్స్, ఎపిడెమోలాజికల్ సమాచారాన్ని క్రోఢీకరించామని ఈ సందర్భంగా లక్ష్మీనారాయణన్ తెలిపారు. దీంతో ఇప్పుడు మరో ప్రశ్న ఉత్పన్నమవుతోంది, కరోనా వైరస్ ఏ మార్గాల్లో వ్యాప్తి చెందుతుందన్న విషయాన్ని కనుగోనాల్సిన అవశ్యకత కూడా ఏర్పడింది, ఇప్పటికే ఎసింప్టమెటిక్ కేసుల్లో వైరస్ లోడ్డు అధికంగా వుంటుందని తేలిన నేపథ్యంలో వీరే కరోనాకు వ్యాప్తికి వాహకాలుగా మారుతున్నారా.? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more