(Image source from: Timesnownews.com)
కరోనా మహమ్మారి పంజా విసరడంతో ఎందరెందరో తలరాతలు మారిపోయాయి. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఆంక్షలతో ఎంతో మందికి ఉపాధి కరువైంది. మరెందరో వ్యాపారాలు దివాలా తీసాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల నుంచి రుణాలు పోందిన రుణగ్రహీతలకు మాత్రం ఎట్టకేలకు ఉపశమనం లభించింది, లాక్ డౌన్ నేపథ్యంలో ఆరు నెలల పాటు కేంద్రం ప్రకటించిన మారటోరియాన్ని వినియోగించుకున్న రుణగ్రహీతలకు నెలవారి కిస్తులు వాయిదా పడటంతో పాటు ఈ ఆరుమాసాల కాలానికి అమలయ్యే వడ్డీపై వడ్డీని తామే భరిస్తామని కేంద్రం తాజాగా ఇవాళ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు తెలిపింది.
లాక్ డౌన్ విధించిన కేంద్రమే వడ్డీపై కూడా నిర్ణయాన్ని తీసుకోవాలని, ఈ విషయంలో రిజర్వు బ్యాంకుపై నెపాన్ని వేసి భుజాలు తడుముకోవడం సమంజసం కాదని అత్యున్నత న్యాయస్థానం కాస్త కఠినంగా సూచించిన నేపథ్యంలో అప్పటివరకు ప్రతీ నెల వడ్డీ కడుతున్న వారికి తాము ఏం సమాధానం చెబుతామన్ని అక్షేపిస్తూ వచ్చిన కేంద్రం.. ఈ తరుణంలో మధ్యేమార్గంగా మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహ్రిషీ నేతృత్వంలో సిఫార్సుల కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో కరోనా వైరస్ ప్రభావం దేశంలోని వివిధ రంగాలపై ఎంత మేర పడిందన్న విషయాలను అధ్యయనం చేసిన కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో కేంద్రసర్కార్ తన వైఖరిని మార్చుకుని.. మార్చి నుంచి ఆగస్టు మాసం వరకు విధించిన మారటోరియంపై వడ్డీపై వడ్డీని మాఫీ చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది.
అంతకుముందు కరోనా నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ఆర్థిక ఉపశమనాల్లో కేవలం మారటోరియం మాత్రమే కల్పిస్తామని, దీని వడ్డీపై వడ్డీ కట్టాల్సిందేనంటూ అదేశించిన కేంద్రం.. మారటోరియం పెట్టుకుంటే అధిక వడ్డీ కల్లాల్సివస్తుందన్న సంకేతాలను దేశ ప్రజల్లోకి పంపింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానాన్ని పలువురు ఆశ్రయించినా మారటోరియం కాలంలో విధించే వడ్డీపై వడ్డీని మాఫీ చేయడం కుదరదని భారతీయ రిజర్వు బ్యాంకు సహా కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపాయి. దీంతో కలో గంజో తాగి నిమ్మకుంటామే కానీ.. మారటోరియం జోలికి వెళ్లినా పరిస్థితి దారుణంగా వుందని అనేక మంది బ్యాంకు రుణగ్రహీతలు మారటోరియం ఆఫ్షన్ ను ఎంచుకునే ధైర్యం చేయలేకపోయారు.
మారటోరియం పెట్టుకుని తమకు లాభం ఏంటీ అని బ్యాంకుల నుంచి రుణాలు పోందిన రుణగ్రహితలు కేంద్రప్రభుత్వాన్ని పలు మాధ్యమాల ద్వారా ప్రశ్నించడంతో మారటోరియం కాలాన్ని ఆరు మాసాల నుంచి రెండేళ్ల కాలం వరకు పోడగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ వడ్డీపై వడ్డీని మాత్రం మినహాయించలేమని తేల్చిచెప్పింది. ఈ కరోనా కాలంలోనూ సక్రమంగా నెలసరి వాయిదాలు చెల్లిస్తున్న రుణగ్రహీతలకు తాము ఏం సమాధానం చెబుతామని.. చెప్పింది. ఇక తీరా మరటోరియం విధించే సమయం కూడా పూర్తైన తరువాత.. ఆగస్టు దాటిని అక్టోబర్ మాసంలో మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని మాఫీ చేస్తామని ప్రకటించింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మారటోరియం పెట్టుకునేందుకు సుముఖత వ్యక్తం చేసిన రుణగ్రహీతలకు మాత్రమే లబ్ది చేకూరినట్లు అయ్యింది.
పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమలు, వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, వినియోగ వస్తువుల కొనుగోళ్లకు తీసుకున్న రుణాలతో పాటు క్రెడిట్ కార్డు బకాయిలకు ఈ మాఫీ వర్తించనుంది. మారటోరియం కాలంలోనూ తమ నెలవారీ వాయిదాలను సక్రమంగా చెల్లించిన వారికి కూడా ఈ ప్రయోజనాన్ని అందించనున్నట్లు దేశ సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింద. దీంతో కష్టకాలంలోనూ తమ కిస్తులు కరెక్టుగా కట్టినవారికి కూడా కేంద్రం నిర్ణయంతో ప్రయోజనం చేకూరనుంది, ఇక మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని మాఫీ చేయడానికి పరిమితిని విధించింది. రూ. 2 కోట్ల వరుకు పోందిన రుణాలకు మాత్రమే వర్తింపజేయనున్నట్లు ప్రకటించింది. కాగా ఈ వడ్డీలపై వడ్డీ మినహాయింపుతో కేంద్రంపై ఆరు లక్షల కోట్ల రుపాయాల భారం పడుతోందని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more