(Image source from: Newindianexpress.com)
కరోనా వైరస్ మహమ్మారి బారిన పడితే ఇక మీ జేబుకు చిల్లే. కరోనా వైరస్ సోకిందని అనుమానాలను వ్యక్తం చేసిన ప్రతీ వ్యక్తి ఇక తమ జేబులోంచి డబ్బులు పెట్టుకుని పరీక్షల నుంచి వైద్యం వరకు అన్ని తానే భరించాల్సి వుంటుంది. అదేంటి ఎందుకిలా.. ఇన్నాళ్లు ప్రభుత్వాలు తమ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహించాయి.. కరోనా అని తేలినవారికి వైద్యాన్ని కూడా ఉచితంగానే అందించాయి కాదా.. మరి ఇప్పుడెందుకిలా అంటారా.. ఇకపై కరోనా నిర్థారణ పరీక్షల నిమిత్తం అవసరమయ్యే టెస్టింగ్ కిట్ల వ్యయాన్ని పూర్తిగా రాష్ట్రాలే భరించాల్సి రావడం ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఇప్పటికే వ్యయభారాన్ని మోస్తున్న తమతో ఇకపై కరోనా భారం మోయలేమని రాష్ట్రాలు తెగేసి చెబుతున్నాయి.
కరోనా నిర్థారణ పరీక్షల కిట్లను రాష్ట్రాలు ఎందుకు భారంగా పరిగణిస్తున్నాయని అంటే.. లాక్ డౌన్ తో అన్ని రాష్ట్రాలు తమకు సాయం కావాలని కేంద్రంపైపు ఆశగా ఎదురుచూస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో అవసరాలను తీర్చుకునే విషయంలోనూ పలు రాష్ట్రాలు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల బకాయిలు ఇస్తే ప్రజావసరాలు, జీతబెత్యాలు కూడా అందించాలని నిర్ణయించాయి. అయితే కేంద్రం ఆశించిన మేరకు తమకు రావాల్సిన నిధులు ఇవ్వకపోవడంతో రాష్ట్రాల్లు ఇప్పటికే కేంద్రంపై గుర్రుగా వున్నాయి. ఇక ఈ క్రమంలో కరోనా టెస్టింగ్ కిట్లపై రాష్ట్రాలకు అందించే సబ్సీడిని కూడా కేంద్రం తాజాగా ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఇండియన్ కౌన్సీల్ ఆఫ్ మెడికల్ రిసర్చ్ (ఐసీఎంఆర్) ఓ ప్రకటనలో పేర్కోంది.
దీంతో కేంద్రం నిర్ణయంపై రాష్ట్రాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అంతేకాదు కరోనా నిర్థారణ పరీక్షల భారం తాము భరించలేనిదని భావిస్తున్నాయి. ఇప్పటికే మేఘాలయా ప్రభుత్వం, ఈ నెల 16 నుంచి ప్రజలకు ఉచిత కరోనా టెస్ట్ లను చేయించలేమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రెస్టోన్ టిన్సాంగ్ స్వయంగా వెల్లడించారు. వచ్చే వారం నుంచి కరోనా పరీక్షలకు ప్రజలు డబ్బు చెల్లించాల్సి వుంటుందని ఆర్టీ-పీసీఆర్, సీబీ నాట్, ట్రూనాట్, రాపిడ్ యాంటీజెన్... ఇలా ఏ టెస్ట్ అయినా, రుసుము వసూలు చేస్తామని ఆయన ప్రకటించారు. నిర్ధారన అయిన రోగులకు ఉచిత భోజనాల సౌకర్యాన్నీ కూడా తొలగించాలన్న ఆలోచనలో ఉన్నట్టు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో మరిన్నీ క్వారంటైన్ కేంద్రాల కోసంగెస్ట్ హౌస్, హోటళ్లలను గుర్తించే పనిలో ఉన్నామని ఆయన తెలిపారు. తాము తీసుకన్న నిర్ణయాలన్నీంటి నుంచి జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని పేదలందరికీ మినహాయింపు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ పేదలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగానే పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు అవసరమని, వారు రూ. 500 చెల్లించాల్సి వుంటుందని, ట్రూనాట్ తదితర ఇతర పరీక్షలకు గరిష్ఠంగా రూ. 3,200 వసూలు చేస్తామని అన్నారు. కాగా, కొవిడ్ టెస్టులకు ఇస్తున్న సబ్సిడీని తొలగించడంతో, పలు రాష్ట్రాలు ఇదే తరహా నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more