(Image source from: Ndtv.com)
పాలు తాగి తల్లి రొమ్ము మీదే గుద్దిన కసాయి మాదిరిగా ఓ హెల్ఏఎల్ ఉద్యోగి.. సంస్థలో పనిచేస్తూ అంతటితో సంతోషించకుండా తల్లి భారతావనికే వెన్నుపోటు పొడిచేలా దేశద్రోహానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రకు చెందిన యాంటీ టెర్రరిస్టు స్వాడ్ ఉద్యోగిని అరెస్టు చేసిన దర్యాప్తు ప్రారంభించింది. కాగా ప్రాథమిక విచారణలో తాను పాకిస్థాన్ కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కి భారత ఫైటర్ ఎయిర్ క్రాప్ట్ కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశానని అంగీకరించాడని ఏటీఎస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఏటీఎస్ అధికారుల తెలిపిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
హెచ్ఏఎల్ సంస్థలో ఫైటర్ ఎయిర్ క్రాప్ట్ యుద్ధవిమానాల తయారీ విభాగంలో విదులు నిర్వహిస్తున్న 41 ఏళ్ల దీపక్ శ్రీసత్ అనే ఉద్యోగి, యుద్ద విమానాల తయారీతో పాటు తయారీ చేస్తున్న సంస్థకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ ఐఎస్ఐకి అందించాడు. ఈ సందర్భంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న యాంటీ టెర్రరిస్టు స్వాడ్ బృందం అతడి నుంచి మూడు సెల్ ఫోన్లతో పాటు ఐదు సిమ్ కార్డులను, రెండు మెమొరీ కార్డులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు, పాకిస్థాన్ కు చెందిన ఐఎస్‌ఐతో నిత్యం సంప్రదింపులు జరుపుతుండగా నిఘా పెట్టిన ఏటీఎస్ బృందం ఇవాళ అతడ్ని అరెస్టు చేసింది. ఈ మేరకు ఏటీఎస్ కు పక్కా సమాచారం అందడంతోనే అతడిపై నిఘా పెట్టి అరెస్ట్ చేసింది.
ఇండియన్ ఫైటర్ ఎయిర్ క్రాప్ట్ యుద్ధవిమానాలకు సంబంధించిన సున్నితమైన సమాచారంతో పాటు నాసిక్ కు సమీపంలో ఓజార్ ప్రాంతంలో ఉన్న హెచ్‌ఏఎల్ తయారీ కర్మాగారానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ నిందితుడు ఐఎస్‌ఐతో పంచుకున్నాడని ఏటీఎస్ అధికారులు తెలిపారు. అధికార రహస్యాల చట్టం కింద నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న పోన్లు, సిమ్ కార్డులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పరీశీలిస్తున్నామని తెలిపారు. నిందితుడు ఏకంగా పదిహేను ఏళ్లుగా సంస్థలో విధులు నిర్వహిస్తున్నాడు, అయితే నిఘా పెట్టిన అధికారులు అతడ్ని ఇవాళ అతని నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు.
విచారణ సందర్భంగా సదరు ఉద్యోగి తనతో నిత్యం ఐఎస్ఐకి చెందిన వారు టచ్ లో వున్నారని, వారి వినతి మేరకు తాను తన సంస్థకు చెందిన సమాచారంతో పాటు యుద్దవిమానాలకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని వారికి అప్పగించినట్లు అంగీకరించాడని ఏటీఎస్ బృందం అధికారులు తెలిపారు, కాగా నిందితుడ్ని అరెస్టు చేసిన ఏటీఎస్ పోలీసులు అతడిపై భారత శిక్షాస్మృతిలోని అధికార రహస్యాల చట్టం కింద సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5ల కింది కేసులు నమోదు చేశారు, నిందితుడిని కోర్టు ముందు హాజరుపరచ్చగా 10 రోజుల రిమాండ్ విధించింది. నాసిక్ కు సమీపంలో 1964లో ఏర్పాటైన తయారీ కర్మాగారంలో మిగ్-21ఎఫ్‌ఎల్, మిగ్-21ఎం, మిగ్-21బీఐఎస్, మిగ్-27ఎం వంటి యుద్ధ విమానాలతో పాటు, కె-13 మిస్సైల్ కూడా తయారవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more