Muslims in India most content in the world, says RSS chief భారత్ లో హిందూ ఆధిపత్యాన్ని అంగీకరించాలి: అర్ఎస్ఎస్

Most content muslims are only in india rss chief mohan bhagwat

India, Hindus, Supremacy, Muslims, Christains, RSS, Mohan Bhagwat, mohan bhagwat rss chief, mohan bhagwat hindu muslim remark, mohan bhagwat muslims remark, mohan bhagwat hindu remark, muslims in india, National Politics

Indian Muslims are the most content in the world, RSS chief Mohan Bhagwat said while asserting that people from all faiths have stood together whenever it has been about the essence of India. He also said any kind of bigotry and separatism are spread only by those whose self-interest gets affected.

ఇక్కడ జీవించాలంటే.. హిందూ ఆధిపత్యాన్ని అంగీకరించాలి: భగవత్

Posted: 10/10/2020 08:34 PM IST
Most content muslims are only in india rss chief mohan bhagwat

భారత దేశంలో ఎవరైనా జీవించవచ్చు అంటూనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ధర్మభూమిలో ఎవరైనా జీవించేందుకు హక్కు వుందని,, అయితే వారు తప్పకుండా హిందూ అధిపత్యాన్ని అంగీకరించాల్సిందేనని అన్నారు. కర్మభూమిగా బాసిల్లుతున్న భారతదేశంలో ముస్లింలు చాలా సంతోషంగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ హిందీ మ్యాగజైన్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దేశ సంస్కృతిపై దాడి జరిగిన ప్రతిసారీ మతాలకు అతీతంగా ప్రజలందరూ ఏకతాటిపై నిలబడి దేశాన్ని రక్షించుకుని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేతారని ప్రశంసించారు.

ఇక  ప్రపంచంలోని మరే దేశంలోనూ లేనంతగా ముస్లింలు ఇక్కడ సంతోషంగా ఉన్నారని అన్నారు. పాకిస్థాన్ లో ఇతర మతాల వారికి హక్కులు ఉండవని అన్నారు. మేవార్‌ రాజు మహారాణా ప్రతాప్‌ సైన్యంలో అనేక మంది ముస్లింలు మొఘల్‌ సామ్రాజ్యాధిపతి అక్బర్‌ చక్రవర్తికి వ్యతిరేకంగా పోరాడారని భగవత్ గుర్తుచేశారు. అయితే పలు ఇస్లామిక్ దేశాలలో మాత్రం అక్కడి ముస్లింలోని పలు వర్గాలకు మధ్య అగ్గిజ్వాలలు రగుతూనే వుంటాయని, వారిలో వారే అధిపత్యంపై పోరుతో హింసకు కూడా దిగుతున్న ఘటనలను మనం చూస్తున్నామని చెప్పారు.
 

కానీ భారత దేశంలో హిందువులు మాత్రమే ఉండాలని మన రాజ్యాంగం చెప్పలేదని అన్నారు. అయితే, ఇకపై మాత్రం ఇక్కడ ఇతర మాతాల వారు జీవించాలంటే హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పారు. ముస్లింలకు కూడా ప్రత్యేకంగా చోటు కల్పించామని, భారతదేశ స్వభావానికి అది ప్రతీక అని పేర్కొన్నారు. స్వాభివిక స్వభావాన్నే హిందూగా పిలుస్తారని భగవత్ అభివర్ణించారు. తమ స్వార్థ ప్రయోజనాలకు విఘాతం కలిగిన వారే దురభిమానాన్ని, వేర్పాటువాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని భగవత్ మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Hindus  Supremacy  Muslims  Christains  RSS  Mohan Bhagwat  National Politics  

Other Articles