ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాది మందిని తన ప్రభావానికి గురిచేస్తూ ఏకంగా 7 లక్షల 59 వేల మార్కును అందుకోనుంది, ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా పక్షం రోజులుగా ప్రతీ రోజు ఏడు వేల మార్కుకు పైగానే కరోనా పాజిటివ్ కేసుల నమోదు.. వరుసగా గత పది రోజులుగా ఐదు వేల మార్కుకు పైగా నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిర్థారణతో ఏకంగా ఏడు లక్షల 59 వేల మార్కును అధిగమించనుంది, ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.
తమిళనాడు కోయంబేడు మార్కట్ లో విజృంభించిన కరోనా ఏపీపై కూడా తన ప్రభావాన్ని చాటింది. అప్పటి నుంచి కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 5 వేలమార్కుకు చేరువలో కేసులు నమోదు కావడం అందోళనకు గురిచేస్తోంది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా ఏడు లక్షల ముఫై వేల మార్కును చేరుకునేందుకు సిద్దంగా వుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 3224 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తంగా 7,58,951 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఎవరూ లేకపోవడం గమనార్హం.
ఇవాళ నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా అత్యధికంగా తూర్పు గోదావరి, ప్రకాశం, పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో నమోదయ్యాయి. దీంతో పాటు చిత్తూరు, కడప జిల్లాల్లో రమారమి రెండు వందలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి, గత వారం రోజులుగా తగ్గుతున్న ఈ కేసులు మళ్లీ పెరగడంతో స్థానిక అధికార యంత్రాంగంతో పాటు జిల్లా వాసులను కూడా కలవరానికి గురిచేస్తోంది. ఇక రాష్ట్రంలో జిల్లాలవారీగా పరిశీలిస్తే.. ఆనంతపురంలో 209, చిత్తూరు జిల్లాలో 293, తూర్పు గోదావరి జిల్లాలో 547, గుంటూరు జిల్లాలో 379, కడప జిల్లాలో 190, కృష్ణా జిల్లాలో 86, కర్నూలు 136 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి.
నెల్లూరు జిల్లాలో 166, ప్రకాశం జిల్లాలో 270, శ్రీకాకుళం జిల్లాలో 133, విశాఖపట్నం జిల్లాల్లో 135, విజయనగరంలో 191, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 489 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, వైద్యశాఖ అధికారులు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకునన్నారు. ఇక పురపాలక సంఘాలు, గ్రామ పంచాయితీల ఆధ్వర్యంలో కంటైన్ మెంట్ జోన్లలో రసాయనాలు చల్లారు. ఆయా ప్రాంతాలను సానిటైజ్ చేశారు. కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి 32 మంది అసువులు బాసారు. కృష్ణా, ప్రకాశం, గుంటూరు, కడప, అనంతపురం, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లో అధిక మరణాలు సంభవించాయి,
24 గంటల వ్యవధిలో 32 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు.కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఐదు మంది చొప్పున, గుంటూరు 4, కడప 4, అనంతపురం 3, తూర్పుగోదావరి 3, చిత్తూరు 2, పశ్చిమగోదావరి 2, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,256కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. దీంతో కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ ఇవాళ 5,504 మంది అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ఈ సంఖ్య 7,08,712 కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత్తం 43,983 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కరోనా బారిన పడి.. విదేశాల నుంచి వచ్చి.. చికిత్స పోందుతున్న వారి సంఖ్య 434గా నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సంఖ్య కూడా ఏకంగా 2461కు చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more