యోగా గురు బాబా రామ్ దేవ్ కు నూతన ప్రయత్నాలు చేయాలన్న తహతహ అధికంగా వుంటోందన్న విషయం తెలిసిందే. ఆ మధ్య బాబా రామ్ దేవ్ కబడ్డీ పోటీలను ప్రారంభిస్తూ ఏకంగా తాను ఓ క్రీడాకారుడిగా జట్టులో చేరి పోటీపడిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఓ సారి కుస్తీ పోటీలు జరుగుతున్న క్రమంలోనూ ఓ కుస్తీ వీరుడితో తలపడి మారీ అతడిపై విజయాన్ని సాధించాడు. ఇలా ఏదో ఒక వార్తతో తన నిత్య వ్యవహారాల నుంచి కొంత సమయాన్ని తీసుకుని మరీ మీడియాలో హైలెట్ గా మారడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే. ఇటీవల బాబా రాందేవ్ కన్నా ఆయన పతాంజలి సంస్థ వైరల్ గా నిలించింది.
కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించేందుకు తాను ఆయుర్వేద ఔషధాన్ని కనుగొన్నామని చెప్పడంతో ఆ మధ్యకాలంలో పతాంజలి సంస్థకు డిజీసీఐ నోటీసులు ఇచ్చింది. అసలు ఈ మందును ఎక్కడ, ఎలా, ఎవరి పర్యవేక్షణలో తయారు చేశారని, ఎక్కడ హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించారని కూడా ప్రశ్నిస్తూ నోటీసులు జారీ చేయడంతో ఈ సంస్థ కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది, అయితే చాలా రోజుల తరువాత ఈ సారి మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ఓ ఏనుగుపై ఆయన కూర్చొని యోగా చేస్తుండగా.. అదుపుతప్పి కింద పడిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
22 సెకండ్ల ఈ వీడియోలో రాందేవ్ బాబా ఏనుగుపై కూర్చొని ఆశ్రమంలోని వ్యక్తులకు యోగాసనాలు నేర్పిస్తున్నట్లు కనిపించింది. అయితే, ఏనుగు ఒక్కసారిగా పక్కకి కదలడంతో దానిపై కూర్చున్న రాందేవ్ బాబా అదుపుతప్పి కిందపడ్డారు. అయితే కిందపడే సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన ఆయన దూకే ప్రయత్నం చేశారు. ఈ కుదపుకు ఏనుగు ఆయనకు ఎలాంటి హాని తలపెట్టకుండా మావటి దాని తొండం వద్దకు వెళ్లండంతో గజరాజు మిన్నకుండిపోయింది. ఈ కిందపడిన బాబా రాందేవ్.. లేచిలేవంగానే.. ఏనుగు అటుఇటూ కదులుతూ తన యోగాసనానికి విఘాతం కలిగించిందని అక్కడి నిర్వహకులతో చెప్పిన ఆయన దుమ్ము దులుపుకొని నవ్వుతూ నడిచివెళ్లారు.
And here is Baba Ramdev performing yoga on Elephant in UP.. Visuals says it all... #Ramdev pic.twitter.com/dCqtvWOqTE
— Anubhav Khandelwal (@_anubhavk) October 13, 2020
కాగా ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలూ కాలేదు. దీంతో అక్కడి ఆశ్రమవాసులు ఆయనను అతిధిగృహంలోకి తీసుకెళ్లారు. ఏనుగు అంబారీపై ఆసనాలు వేస్తూ కిందపడ్డ రాందేవ్ బాబా వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మధురలోని రమణారటి ప్రాంతంలోని గురు శరణన్ ఆశ్రమంలో జరిగింది. అయితే నెట్టింట్లో బాబా రాందేవ్ వీడియోపై నెటిజనులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. బాల్యంలో చిన్నారులు చేసే విధంగా ఇప్పటీకీబాబా రాందేవ్ చేయడం విడ్డూరంగా వుందని కొందరు అంటుండగా, ఏనుగు కదలడానికి బాబా ఏం చేశారంటూ మరికొందరు ప్రశ్నించారు. ఇక ఇంతకు సంబంధించి ఇలాంటి వీడియోనే ఆగస్టు నెలలో వైరల్ అయ్యింది. సైకిల్‌పై వెళ్తూ ఆయన ఫౌంటేన్ వద్ద జారి పడ్డారు.
Loved the twist ending. pic.twitter.com/JNggkZVpV4
— Aniruddha Guha (@AniGuha) August 21, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more