Revanth arrested on visit to Kalwakurthy project కొల్హాపూర్ వెళ్లిన రేవంత్ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్..

Revanth reddy and congress leaders arrested on their visit to kalwakurthy project

Revanth Reddy, Mallu Ravi, kalvakurthy lift irrigation, kalvakurthy pump house, congress leaders arrest

The Congress leaders including MP, A Revanth Reddy were arrested when tried to visit to pump house of Kalwakurthy Lift Irrigation scheme, which was submerged in backwaters of Srisailam reservoir on Friday. They were sent to Uppununthala police station.

ITEMVIDEOS: కల్వకుర్తి లిప్ట్ ప్రమాద పరిశీలనకు వెళ్లిన రేవంత్ రెడ్డి అరెస్ట్..

Posted: 10/18/2020 01:16 AM IST
Revanth reddy and congress leaders arrested on their visit to kalwakurthy project

(Image source from: Telugurajyam.com)

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో జరిగిన ప్రమాదాలపై కాంగ్రెస్ నేతలు ఓ వైపు పరామర్శిస్తూనే మరోవైపు కల్వకుర్తి లిప్టు పంప్ హౌజ్ వద్ద జరిగిన ప్రమాదాన్ని పరిశీలించేందుకు వెళ్లగా వారిని పోలీసులు అడ్డుకుని అనుమతి లేకుండా పరిశీలన రావడం చట్టరిత్యా నేరమంటూ అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా అరెస్టు అయిన కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో విషయం సంచలనంగా మారింది. ఇక జరిగిన ప్రమాదం విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. నాగర్ కర్నూల్‌ జిల్లా ఎల్లూరు వద్దకు చేరుకున్న రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లు రవి, సంపత్ కుమార్ లతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కృష్ణా నది ఒడ్డున నిర్మితమైన మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథక మొదటి దశ లిఫ్టు పంపుహౌజ్ లో నిన్న సాయంత్రం ప్రమాదం సంభవించింది. నీళ్ల పంపింగ్‌ నడుస్తున్న సమయంలో చోటుచేసుకున్న ఈ భారీ ప్రమాదంలో మోటారు బిగించిన ఫౌండేషన్‌ బోల్టులు ఒక్కసారిగా ఊడిపోయాయి. దీంతో పంపుహౌస్‌ గోడని చీల్చుకొని ఫౌండేషన్‌ రాడ్లు, మోటార్ల పరికరాలు దూసుకెళ్లాయి. దీంతో సర్జిపూల్‌ నుంచి వరదనీరు భారీగా పంప్‌హౌస్‌లోకి చేరింది. కొన్ని నిమిషాల్లోనే పంప్‌హౌస్‌లోని 14 అంతస్తుల్లోేని పది అంతస్తుల్లోకి నీరు చేరిపోయిందంటే ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మోటార్లను ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో అక్కడి సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.

దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రోజు ప్రమాద స్థలిని పరిశీలించేందుకు కొల్లాపూర్ వెళ్లిన కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, మల్లు రవి, సంపత్ కుమార్ లను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీనిపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిన్న శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాదం, నేడు కల్వకుర్తి లిఫ్ట్ మునక... ప్రమాద స్థలికి ప్రతిపక్షం వెళితే ప్రభుత్వానికి ఉలుకెందుకు? ఖాకీ పహారతో నిజాన్నెందుకు దాస్తోంది. ఆలోచించు తెలంగాణమా’ అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles