Clarity within two days over the release of Sasikala శశికళ విడుదలపై రెండు రోజుల్లో స్పష్టత: న్యాయవాది

Clarity within two days over the release of vk sasikala says her lawyer

sasikala, papappana Agrahara jail, bangalore, dissappropriote assets, Karnataka court, Raja senthoor Pandian, AIADMK, Tamil Nadu, Politics

Sasikala release date will be decided within 2 days, says her lawyer Raja senthoor Pandian. Sasikala now goes to Karnataka court over her fine amount. After Sasikala comes out from the jail, AIADMK politics will take turns and twists.

జనవరిలో పరప్పన అగ్రహం నుంచి విడుదల కానున్న చిన్నమ్మ

Posted: 10/28/2020 06:50 PM IST
Clarity within two days over the release of vk sasikala says her lawyer

(Image source from: tamil.samayam.com)

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళ.. జయలలిత అక్రమాస్థుల కేసులో దోషిగా నిర్థారణ కావడంతో ఆమెకు న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే, బెంగుళూరులోని పరప్పన అగ్రహారం జైలులో గత మూడేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ.. జైలులో మంచిగా నడుచుకుంది. దీంతో సత్ప్రవర్తన కింద కొంత ముందుగానే అమెను విడుదల చేస్తున్నారన్న విషయం కూడా ఇప్పటికే బయటకు వచ్చింది. అయితే ఇంతకీ అమెను ఎప్పుడు విడుదల అవుతున్నారన్న ఉత్కంఠ మాత్రం తమిళనాడు ప్రజలో నెలకొంది.

అన్ని అనుకున్నట్లుగానే సజావుగా సాగితే రానున్న రెండు మూడు రోజుల్లో తమిళనాట చిన్నమ్మగా పేరొందిన శశికళ ఎప్పుడు విడుదలయ్యే విషయమై క్లారిటీ వస్తోంది. ఆమె తరపు న్యాయవాది రాజా సేతుర్పాండియన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. దసరా సెలవుల నేపథ్యంలో ఈ నెల 27 వరకు న్యాయస్థానానికి సెలవులు ప్రకటించారని, ఈ నెల 28 తరువాత న్యాయస్థానాలు మళ్లీ తెరుచుకున్న తరువాత శశికళ విడుదల విషయంలో స్పష్టం వస్తోందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని న్యాయస్థానమే డిసైట్ చేస్తోందని న్యాయవాది తెలిపారు.

అక్రమాస్థుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల రూపాయల జరిమానాను కూడా విధించిగా, శిక్షాకాలం పూర్తైన తరువాత జరిమానాగా కట్టాల్సిన డబ్బును సిద్దం చేశామని తెలిపారు. న్యాయస్థానం నుంచి విడుదల సమాచారం తమకు అందిన వెంటనే సదరు మొత్తాన్ని చెల్లిచేందుకు కూడా ఏర్పాట్లు చేశామని తెలిపారు, అన్ని అనుకున్నట్లు జరిగితే సత్ర్పవర్తన కింద మరో రెండు రోజుల వ్యవధిలో శశికళ విడుదలపై క్లారిటీ వస్తుందని అమె తరపు న్యాయవాది రాజా సేతుర్పాండియన్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles